Site icon HashtagU Telugu

Milk Disadvantages : రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగే, అలవాటు ఉందా…అయితే ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Milk Benefits

Milk Benefits

పాలు (milk) సంపూర్ణ ఆరోగ్యం అంటుంటారు. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తారు. ఎందుకంటే పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఎముకల నుంచి మొదలుకుని అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈ కారణంగానే మన పెద్దలు చిన్నప్పటి నుంచి పాలు తాగమని ఒత్తిడి చేస్తుంటారు, పెద్దయ్యాక రాత్రి పాలు తాగి నిద్రపోవడం మన అలవాట్లలో ఒకటి. కానీ కొన్నిసార్లు రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. అవేంటో చూద్దాం.

1 బరువు పెరుగుతారు:

రాత్రి పాలు తాగిన తర్వాత నిద్రించే అలవాటు మీ బరువును పెంచుతుంది. ఎందుకంటే ఒక గ్లాసు పాలలో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. అందువల్ల, నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల, మన కేలరీలు బర్న్ చేయబడవు, అది బరువుగా, కొవ్వుగా మారుతుంది.

2- అజీర్ణ సమస్య:

రాత్రి పాలు తాగడం వల్ల మన ఆహారం సరిగ్గా జీర్ణం కావు. మరుసటి రోజు ఉదయం మన పొట్ట శుభ్రంగా ఉండకపోవడమే కాకుండా అజీర్ణ సమస్య తలెత్తుతుంది. మీకు అదే సమస్య ఉంటే, రాత్రిపూట పాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా చల్లని పాలు తాగకూడదు.

3- నిర్విషీకరణలో అవరోధం:

రాత్రి నిద్రిస్తున్నప్పుడు మన కాలేయం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ పాలు తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ పని మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు అనేక రకాల కడుపు సంబంధిత వ్యాధులకు గురవుతారు. పాలలో లాక్టోస్ ,ప్రొటీన్లు ఉంటాయి. అందుకే రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదు. ఎందుకంటే లాక్టోస్ కారణంగా, ఇది మీ నిద్రను తగ్గిస్తుంది. కొన్నిసార్లు నిద్రలేమికి కారణం అవుతుంది.

Exit mobile version