Life Style: హైట్ తక్కువ అని ఫీల్ అవుతున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి

  • Written By:
  • Updated On - March 4, 2024 / 11:44 AM IST

Life Style: ప్రస్తుత కాలంలో అందంగా ఉండాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అంతే కాదు.. ఇక స్లిమ్ గా, ప్రభాస్ కటౌట్ మాదిరిగా మెరిసిపోవాలని కలలు కంటారు. అయితే  పొట్టిగా ఉన్నవారికి ఈ కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తాము ధరించే దుస్తులలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా పొడవుగా కనిపించవచ్చు. ఇందు కోసం కొన్ని సూచనలను పాటించాలి. వాటి గురించి తెలుసుకుని పాటిద్దాం.

చాలా మంది ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్,టీ షర్ట్ వేసుకొని,నడుము చుట్టూ షర్ట్ లేదా స్వెటర్ కట్టుకుంటారు. ఇలా కట్టుకోవటం ప్యాషన్ అయిన పొట్టిగా ఉన్నవారు మరింత పొట్టిగా కనపడతారు. అందువలన ఈ పద్దతికి స్వస్తి పలకండి. పొడవాటి స్కర్ట్ వేసుకోవటం వలన పొడవుగా కనపడటం అనేది అవాస్తవం. మీరు కొద్దిగా హై హిల్స్ ఉండే చెప్పులు లేదా షుస్ వేసుకొని,మోకాలు కిందికి ఉండే స్కర్ట్స్,మిడ్డిలు ధరిస్తే పొడవుగా కనపడటానికి ఎక్కువగా అవకాశం ఉంది.

పొట్టిగా ఉన్నవారు పై నుంచి క్రింది దాక ఒకే రంగు డ్రస్ ధరించటం మంచిది కాదు. ఉదాహరణకి బ్లూ జీన్స్ వేసుకుంటే పైన టాప్ కాస్త ముదురు రంగు ఉండేది ఎంపిక చేసుకోవాలి. తేలికపాటి దుస్తులతో పాటు చిన్న చిన్న డిజైన్స్ ఉన్న దుస్తులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పెద్ద పెద్ద డిజైన్స్ వీరికి నప్పవు. అందువల్ల పైన చెప్పిన సూచనలను పాటించి పొట్టిగా ఉన్న మీరు పొడవుగా కనపడటానికి ప్రయత్నం చేయండి. అయితే చాలామంది హైట్ పెరగడం కోసం వైదపరమైన ట్రీట్ మెంట్స్ తీసుకుంటున్నారు. అలాంటి చేయొద్దని చెబుతున్నారు పలువురు డాక్టర్లు.