Site icon HashtagU Telugu

Sunday Remedies : ఆదివారం రోజు అలాంటి పనులు చేస్తున్నారా? అయితే అష్ట దరిద్రం పట్టుకున్నట్టే..

Do You Do Such Things On Sunday..

Do You Do Such Things On Sunday..

Remedies for Sunday : ఆదివారం వచ్చింది అంటే చాలు చిన్నపిల్లలు ఆఫీసులకు వెళ్లేవారు ప్రతి ఒక్కరికి కూడా సెలవులు వస్తాయి. దాంతో ఆదివారం రోజు ఇంటిల్లిపాది ఇంట్లోనే సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక ఆరోజు చికెన్, మటన్, బిర్యానీలు తెచ్చుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఆదివారం (Sunday) వచ్చింది అంతే చాలు అది ఒక పండుగే. అయితే సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఆదివారానికి (Sunday) చాలా ప్రత్యేకత ఉంది. ప్రాధాన్యత ఉంది. అందుకే అంత ప్రాధాన్యత ఉన్న ఆదివారం రోజున మనం కొన్ని పనులు చేయకూడదట. అవి చేస్తే మహా పాపమట. అష్ట దరిద్రమట. మరి ఆదివారం ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

We’re Now on WhatsApp. Click to Join.

మన పూర్వీకులు ఎక్కువగా సుర్యుడిని ఆరాధించేవారు. భారతీయ సంస్కృతి అంటేనే సూర్యుడిని ఆరాధించే సంస్కృతి. భారతీయులు జరుపుకునే పండుగలు కూడా ఎక్కువగా సూర్యుడిని బేస్ చేసుకొనే వచ్చాయి. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి తర్పణాలు వదిలేయడం ఇలా సూర్యుడిని ఆరాధించేవాళ్లు మన పూర్వీకులు. అందుకే సూర్యుడికి గుర్తుగా మన పూర్వీకులు పెట్టుకున్న రోజే ఆదివారం. దాన్నే రవివారం అని కూడా అంటారు. రవి అంటే సూర్యుడు. సూర్యుడిని కొలవడం కోసం సూర్యుడిని ఆరాధించడం కోసం వారంలో ఒక రోజును మన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి ఆదివారం భారతీయులకు చాలా పవిత్రమైనది. కానీ ఆదివారాన్ని వెనకటి నుంచి ఒక సెలవు దినంగానే మనం చూస్తున్నాం. ఆ రోజునే ఎక్కువగా మాంసం తినడం, మద్యం తాగడం స్త్రీలతో సాంగత్యం చేయడం లాంటి పనులు చేసి ఆదివారం విశిష్టతను దెబ్బతీస్తున్నారు.

ఆదివారం అంటే రెస్ట్ తీసుకునే రోజని చెప్పి ఆదివారం రోజున పెందలాడే లేవకపోవడం, బాగా తిని తొంగోవడం మాంసం, మద్యం తాగడం లాంటివి చేసి ఆదివారాన్ని అపవ్రితం చేస్తున్నారు. నిజానికి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్యుడే. మనిషి మీద సూర్య కిరణాలు పడితే చాలు. చాలా రోగాలు నయం అయిపోతాయి. చిన్నపిల్లలను కూడా ఎక్కువగా సూర్యరశ్మి తగిలేలా పడుకోబెడతారు. సూర్యుడు మనిషి లైఫ్ లో చాలా ముఖ్యం. సూర్యుడు లేకపోతే మనిషే లేడు. అందుకే సూర్యుడిని ఖచ్చితంగా ఆదివారం రోజున కొలవాల్సిందే. అలా కాదని ఆదివారం రోజున ఇష్టమున్నట్టు చేయడం, స్నానం చేయకపోవడం, తెల్లవారుజామునే లేవకపోవడం, మద్యం, మాంసం తినడం, తాగడం లాంటివి చేస్తే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందట. అలాగే ఏ పని చేసినా కాదట. ఇంకా జన్మజన్మలకు దరిద్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. దరిద్రం అంటే డబ్బు లేకపోవడమే కాదు జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు రావడం, అనారోగ్యం దరిచేరడం ఇవన్నీ కూడా ఆదివారం చేసే తప్పుల వల్లనే అని పురాణాల్లో రాసి ఉంది.

Also Read:  Old Phone – Selling Tips : పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? ఈ జాగ్రత్తలు మస్ట్