Site icon HashtagU Telugu

Health Tips: రాత్రి జుట్టుకు నూనె పట్టించే ఉదయాన్నే తల స్నానం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 02 Dec 2023 04 55 Pm 5931

Mixcollage 02 Dec 2023 04 55 Pm 5931

మామూలుగా మనలో చాలామందికి రాత్రి పడుకునే సమయంలో తలకు నూనె పట్టించి ఆ తర్వాత ఉదయాన్నే తలస్నానం చేయడం అలవాటు. చాలామంది స్త్రీ పురుషులు ఇలాగే చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం మంచిదేనా, వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే వాస్తవానికి జుట్టుకు శరీరం లాంటి ఆహారం చాలా ముఖ్యం జుట్టుకు నూనె ఆహారంగా ఉపయోగపడుతుంది. జుట్టుకు సరైన సమయంలో నూనె అప్లై చేయడం వలన జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతూ ఉంటుంది.

కాబట్టి రోజు లేదా వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు జుట్టుకు నూనెతో మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల చుండ్రు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నూనె అప్లై చేసిన తర్వాత కూడా చాలా సార్లు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. నూనె రాసే విధానంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీ జుట్టు పై ఒక గంట కంటే ఎక్కువ సేపు నూనెను ఉంచకూడదు. మీరు మీ జుట్టు పై ఎక్కువ సేపు ఆయిల్ ని ఉంచినట్లయితే అది రంద్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. మీ జుట్టు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. మీ జుట్టులో నూనెను ఎక్కువ సేపు ఉంచడం వలన జుట్టు దెబ్బతింటుంది. తలలో మొటిమలు దురదలు లాంటివి వస్తూ ఉంటాయి.

దాని వలన జుట్టు రాలడం సమస్య వస్తుంది. మీరు నూనెను గట్టిగా రుద్దకుండా అప్లై చేయాలి. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి లేదా తలపై సహజంగా జిడ్డుగా ఉండే వాళ్ళు నూనె అసలు పెట్టుకోకూడదు. ఈ సమయంలో నూనెని ఎక్కువ సేపు ఉంచడం వల్ల తలపై దుమ్ము, క్రిములు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ సమస్య వచ్చిన తర్వాత పైగా బదులుగా మీరు తడి జుట్టును నూనెను అప్లై చేయడం అస్సలు చేయవద్దు. చాలాసేపు జుట్టుకు నూనె అప్లై చేయడం వలన జుట్టుకు పుష్కలంగా పోషన దొరుకుతుంది. చాలామంది మహిళలు లేదా పురుషులు ఈ జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో రాత్రిపూట నూనె అప్లై చేసుకోవడం ఉదయాన్నే లేచి తల స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయటం మానుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం జుట్టుకు నూనెను అప్లై చేయడానికి ఒక సమయం ఉంది. మీరు అప్లై చేసినట్లయితే దాని 45 నుంచి 55 నిమిషాల వరకు మాత్రమే ఉంచుకోవాలి. దానికంటే ఎక్కువ సేపు ఉంచడం వల్ల జుట్టు సమస్యలు ఎన్నో వస్తాయి.