నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయ ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఆ నిమ్మకాయ షర్బత్, లెమన్ వాటర్ అంటూ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే పలు పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి నిమ్మకాయతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం సగం కోసిన నిమ్మకాయలో తేనె కొద్దిగా వేసి ముఖానికి మెత్తగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆపై చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం కాంతివంతంగా మారి, ముఖంపై ముడతల వల్ల వచ్చే నల్ల మచ్చలు తొలగిపోతాయట. ఈ విధంగా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. ముఖంపై ముడతల సమస్యలు ఇబ్బంది పడుతుంటే 30 రసంలో నిమ్మ తొక్క పొడి కలుపుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలట. అరగంట ఆగిన తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై ముడతలు మాయం అవడంతో పాటు యవ్వనంగా కనిపిస్తారు అని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి రాసుకుంటే పెదవులు మృదువుగా అందంగా తయారవుతాయట.
అయితే పొడి చర్మం ఉన్నవారు మాత్రం నిమ్మరసాన్ని చాలా తక్కువ మోతాదులో వాడాలనీ చెబుతున్నారు. అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు నేరుగా నిమ్మరసాన్ని వాడకూడదట. పాలల్లో గాని నీళ్లలో గాని కలుపుకొని అప్పుడు ముఖంపై అప్లై చేసుకోవాలి. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని వేసి బాగా కలపాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ నీరు పోసి బాగా కలియబెట్టాలి ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ దూదితో గాని ముఖానికి రాసుకుంటూ మూడు నుంచి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయడం వలన ముఖంపై మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుందట.