Site icon HashtagU Telugu

Kitchen Tips: వంట త్వరగా పూర్తవ్వాలంటే ఈ కిచెన్ టిప్స్ ని ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 07 Dec 2023 01 57 Pm 6790

Mixcollage 07 Dec 2023 01 57 Pm 6790

మామూలుగా ఇంట్లో మహిళలు వంటలు చేసే సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా పండుగ సమయాలలో ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ వంటకాలు చేయలేక ఇబ్బంది పడుతూ అలసిపోతూ ఉంటారు. చాలామంది అటువంటి సమయంలో విరక్తిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వంట త్వరగా పూర్తి అయ్యే కొన్ని సింపుల్ చిట్కాలను నీకోసం తీసుకువచ్చాం. మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పన్నీర్ కర్రీ లో వేస్తే పన్నీర్ సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే కర్రీలో గ్రేవీ ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే పచ్చి బఠానీ ఉడికించేటప్పుడు అందులో కాస్త చక్కెర వేస్తే వాటి కలర్ తగ్గుతుంది. ఇదే చిట్కాని ఆకుకూరల విషయంలో కూడా ఫాలో అవ్వచ్చు. కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడు అందులో కాస్త ఆయిల్ వేస్తే ఆ పప్పు కుక్కర్ నుంచి పప్పు బయటికి పొంగదు. పాస్తా, నూడిల్స్ ఉడికించినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. అయితే వాటిని విడగొట్టాలి అనుకున్నప్పుడు వాటిపై చల్లని నీరు పోస్తే చాలు ఆటోమేటిక్ గా పొడిపొడిగా అవుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్, టమాటో, చీజ్ చాక్లెట్స్ ని రూమ్ టెంపరేచర్ లో పెడితే టేస్ట్ మారవు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలి అంటే ముందు వాటిని ముప్పావు భాగం వేయించి నాలుగు ఐదు గంటలు ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత వాటిని డీప్ ఫ్రై చేస్తే కరకరలాడుతాయి. ఆకుకూరలు వారం పది రోజులు అయినా ఫ్రెష్ గా ఉండాలి అంటే వాటిని తరిగి ప్లాస్టిక్ కంటైనర్ లో స్టోర్ చేయాలి.