Site icon HashtagU Telugu

Cockroaches: బొద్దింకల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే చేస్తే చాలు బొద్దింకలు పరార్ అవ్వాల్సిందే?

Mixcollage 22 Feb 2024 09 01 Pm 7210

Mixcollage 22 Feb 2024 09 01 Pm 7210

మాములుగా మనకు కిచెన్ లో అలాగే వాష్ రూమ్ లో బొద్దింకలు కనిపిస్తూ ఉంటాము. అయితే బొద్దింకలను తరిమి కొట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బొద్దింకల బెడద తగ్గదు. చాలామంది ఈ బొద్దింకలతో విసిగిపోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ బుద్దింకల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీనికి మనకి ఇంట్లో దొరికే రెండే రెండు వస్తువులు కావాలి. ఒకటి కర్పూరం ఇంకొకటి అగరొత్తులు కాక్రోస్ కి మంచి స్మెల్ అనేది అసలు పడదు. దీనికోసం కావాల్సింది ముద్ద కర్పూరం తీసుకోవాలి.

అది తీసుకొని బాగా దాన్ని మీరు చేత్తో మెత్తగా నలుపు కోవాలి. మీరు మీ ఇంట్లో వాడే అగరవత్తులు ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోవాలి. దానికి పైన అగురతు ఉంటుంది. మీరు ఆ పుల్లల నుంచి ఆ పైన ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు సపరేట్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు తీసుకొని దాంట్లో అంటే మీరు స్ప్రే చేసుకునే ఏరియాను బట్టి వాటర్ అనేది తీసుకోండి. అలాగే మీరు తీసుకున్న కర్పూరం అలాగే అగరోవత్తల క్వాంటిటీ ఏదైతే ఉందో అది. మీరు ఆ పౌడర్ని ఆ అరకప్పు నీళ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పోసేసి చక్కగా ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు అలాగే దాంట్లో ఉంచేయాలి. ఇంకా స్పూన్ తో బాగా కలిపేసి మూత పెట్టేసి మీరు పక్కన పెట్టేసేయండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్ లోకి వచ్చేస్తుంది.

ఇక దాని తర్వాత మీరు రెండు విధాలుగా వాడుకోవచ్చు. మీరు స్ప్రే వాటిల్లో పోసుకొని చేసుకుంటూ వెళ్ళాలి. నైట్ కచ్చితంగా స్ప్రే చేయాలి. మార్నింగ్ లేసేటప్పటికీ మీరు చూస్తే మీ ఇల్లు మంచి సువాసన వస్తుంది. అలాగే బొద్దింక లేవైతే ఉన్నా అవి స్మెల్ కి చిన్న చిన్నగా క్రమక్రమంగా మీ ఇంట్లోంచి బయటికి అనేది వెళ్లిపోతాయి.