Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ స్పాట్స్ ఒక్కసారిగా మాయం కావాలంటే ఇలా చేయండి!

Beauty Tips

Beauty Tips

చర్మం పైన మచ్చలు, డార్క్ స్పాట్స్ (Blemishes, dark spots) కనిపించడం మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. అయితే ముఖం క్లీన్‌గానూ, చక్కగా కనిపిస్తే మనల్ని ప్రపంచానికి ధైర్యంగా పరిచయం చేయగలుగుతాం. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో సిద్ధం చేసుకునే కొన్ని హోమ్ రిమిడీస్ ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యమైనది పసుపు. ఇప్పుడు పసుపుతో తయారుచేసే మూడు ఫేస్‌ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

1. పసుపు, పెరుగు, బేసన్ ఫేస్‌ప్యాక్

ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి.
విధానం:

ఒక స్పూన్ పసుపు

ఒక స్పూన్ పెరుగు

ఒక స్పూన్ బేసన్

ఈ మూడు పదార్థాలను బాగా కలిపి ముద్దగా తయారు చేయండి. ముఖానికి అప్లై చేసి అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత సాదా నీటితో క్లీన్ చేయండి.

2. పసుపు, చందనం, తేనె ప్యాక్

ముక్కు చుట్టూ లేదా గడ్డంపై మచ్చలు ఉంటే ఈ ప్యాక్ చాలా ఫలితాన్నిస్తుంది.
విధానం:

చిటికెడు పసుపు

చిటికెడు చందనం పొడి

ఒక స్పూన్ తేనె

ఐచ్ఛికంగా కొద్దిగా గులాబీ జలాన్ని కూడా కలిపుకోవచ్చు

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు వదిలేయండి. తరువాత సాదా నీటితో ముఖం కడగండి.

3. టమాటా, చక్కెర బియ్యం మావు, పసుపుతో స్కిన్ క్లెన్సింగ్ ప్యాక్

మచ్చలు తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.

విధానం:

ఒక స్పూన్ బియ్యం పిండి

టమాటా రసం

చిటికెడు పసుపు

కొద్దిగా పాలు

ఈ నాలుగు పదార్థాలను కలిపి పేస్ట్ తయారుచేయండి. ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయండి. తరువాత ముఖాన్ని బాగా కడిగేయండి.

గమనిక: ఈ ప్యాక్‌లు న్యాచురల్ అయినప్పటికీ, కొత్తగా వాడే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల అలర్జీలు ఏమైనా వస్తాయా అనేది ముందే తెలుసుకోవచ్చు.

సహజంగా అందాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఇలాంటివి రెగ్యులర్‌గా పాటించడం ఎంతో ఉపయోగకరం!

Read Also : Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు