Morning Works : ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. కొన్ని పనులు అస్సలు చేయకూడదు..

కొంతమంది రోజంతా చాలా డల్ గా కనిపిస్తారు. ఆరోగ్యం బాగున్నా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపించరు. అయితే ఇదంతా కూడా మనం పొద్దున్నే లేచి ఏం చేశాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 06:30 PM IST

కొంతమంది రోజంతా చాలా డల్ గా కనిపిస్తారు. ఆరోగ్యం బాగున్నా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపించరు. అయితే ఇదంతా కూడా మనం పొద్దున్నే లేచి ఏం చేశాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పొద్దున్నే లేచాక ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు తెలుసుకోవాలి.

ఇప్పుడు చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ పట్టుకుంటున్నారు. ముందు ఇది మానుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లేవగానే ఫోన్ పట్టుకోవడం, బెడ్ మీద ఉండే ఫోన్ చూడటం లాంటివి చేయొద్దు. మనం ఫ్రెష్ అయ్యేంతవరకు ఫోన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేవగానే ఫోన్ బ్లూ లైట్ మన కళ్ళల్లో పడటం అంత మంచిది కాదు. దీనివల్ల అలసట ఎక్కువగా ఉంటుంది.

చాలా మంది లేవగానే ఉరుకులు, పరుగులుగా పనులు చేస్తారు. ఎక్కడ ఆఫీస్ కి లేట్ అయిపోతుందేమో అని కంగారు పడుతుంటారు. ఉదయాన్నే అస్సలు కంగారు పడొద్దు, హడావిడి పడొద్దు. కావాలంటే ఒక అరగంట ముందుగా లేచి మన పనులని నిదానంగానే చేసుకోవాలి.

అలాగే రోజంతా శారీరికంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే కచ్చితంగా డైలీ ఉదయాన్నే లేచాక వ్యాయామం చేయాలి. వార్మప్, యోగా, ధ్యానం లాంటివి చేయడం వలన రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం చేసేవాళ్ళు పొద్దున్నే లేవగానే బరువులు ఎత్తకూడదు. రాత్రంతా మన శరీరంలో ఎలాంటి కదలికలు ఉండవు కాబట్టి కండరాలు బిగుసుకుపోతాయి. ఉదయాన్నే లేవగానే పెద్ద బరువులు ఎత్తితే కండరాలకు ప్రమాదం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కాసేపు మన శరీరంలోని అన్ని భాగాలు కదిలేలా వార్మప్ చేసి ఆ తర్వాత బరువులు మోసే లాంటి వ్యాయామాలు చేయాలి.

చాలా మంది ఆఫీస్ కు, కాలేజీలకు, తమ పనులకు వెళ్ళడానికి టైం అయిపోతుందని టిఫిన్ చేయడం మానేస్తుంటారు. కొంతమంది కాఫీ, టీలు తాగి సరిపెట్టేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు మిస్ చేయొద్దు. కచ్చితంగా రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినాలి. అలాగే ఉదయం పూట పూరి, బజ్జి లాంటి ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఇడ్లీ, ఉప్మా, దోశ లాంటి మృదువైన ఆహరం తీసుకుంటే శరీరానికి హాయిగా ఉంటుంది.