Beauty Tips: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

మాములుగా వేసవి కాలం మొదలైంది అంటే చాలు చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అయితే వేసవిలో సూర్యుడి ప్రతాపం వల్ల ప్ర

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 07:39 AM IST

మాములుగా వేసవి కాలం మొదలైంది అంటే చాలు చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అయితే వేసవిలో సూర్యుడి ప్రతాపం వల్ల ప్రజలు మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి భయపడుతూ ఉంటారు. కాగా ఈసారి సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పదే పదే చెబుతోంది. మరి ఈ సమయంలో ఎండల దాటి నుంచి రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాన
నికి వస్తే.

వేసవిలో ముఖ్యంగా ఎండాకాలం శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. ఎండాకాలం తగినన్ని మంచినీళ్లు తాగడంవల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఎండలలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సూర్యుని తీవ్రమైన కిరణాల నుండి సన్ స్క్రీన్ లోషన్స్ చర్మాన్ని కాపాడతాయి. ఇక ఎండలలో బయట తిరగకుండా ఉండటమే మంచిది. ఒకవేళ పని మీద బయటకు వెళ్ళవలసి వస్తే ఒక గొడుగు తీసుకు వెళ్లడం ఉత్తమం.దీని ద్వారా ఎండ బారి నుంచి మన చర్మాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం. ఎండల కాలంలో నల్లని వస్త్రాలు కాక తెల్లని వస్త్రాలు ధరించటం వలన కూడా మన చర్మాన్ని ఎండ తీవ్రత నుండి రక్షణ లభిస్తుంది.

వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు , పళ్ళ రసాల వంటివి తాగాలి. టమాటో, కీరా దోసకాయ, బొప్పాయి వంటివి తినటంతో పాటు కుదిరినప్పుడు వీటితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఎండాకాలంలో ముఖం నిగారింపును సొంతం చేసుకోవడానికి ముఖానికి సరిపోయే విధంగా పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మంచిది. ఇక అప్పుడప్పుడు ఎండకు చర్మం నల్లబడితే ట్యాన్ పోయే విధంగా సహజ సిద్ధమైన ప్యాక్ లు వేసుకోవాలి. ఇంట్లో కూడా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.