Site icon HashtagU Telugu

Don’t Share With Partner: భాగస్వామితో అన్ని విషయాలు పంచుకోవాలనీ లేదు..!!

Hands

Hands

జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. బాధ అయినా…సంతోషమైనా…భాగస్వామితో షేర్ చేసుకుంటారు. కానీ అన్ని విషయాలను తప్పనిసరిగా భాగస్వామితో పంచుకోవాలనీ లేదు. కొన్నింటిని దాచుకుంటే ఇద్దరికీ మంచిది. అయితే కొన్ని విషయాలను పంచుకునేటప్పుడు సంయమనం చాలా అవసరం.

కుటుంబం:
మీ భాగస్వామి మీ అమ్మానాన్నలను ఎగతాళిచేస్తే…తక్కువగా మాట్లాడితే మీకెలా ఉంటుంది. మనస్సు కలుక్కుమంటుంది కదూ. అలాగే అత్తగారింట్లో మీకు నచ్చని సభ్యులెవరైనా ఉంటే…వారితో ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా సానుకూలంగా…నిదానంగా చెప్పండి. మీ అభియోగాలు…మీ వారికి మీ పట్ల కోపం, చులకన భావాలను కలిగించే అవకాశం ఉంటుంది. మీ అనుబంధం మరింత బలంగా ఉండాలంటే కుటుంబ బంధాలు ముఖ్యమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

విమర్శలు వద్దు:
విమర్శలకు దూరంగా ఉండాలి. నిజాయితీగా ఉండటంలో ఎలాంటి తప్పులేదు. అంతేకానీ ఎదుటివారి లోపాలను భూతద్దంలో పెట్టి చూడకూడదు…మాట్లాడకూడదు. మీ భాగస్వామి అలాంటి పనులు చేస్తే…మీకు ఇబ్బంది కలిగితే…ఆ విషయాన్ని స్పష్టం చెప్పాలి. అంతేకానీ వ్యంగ్యంగా మాట్లాడకూడదు.

గొడవలు వద్దు:
ఆర్థికపరమైన అంశాలను భార్యభర్తలు ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. మరీ కావాలనుకుంటే ఉమ్మడి ఖాతా తీసుకోవడం మంచిది. డబ్బును ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఆర్థిక సమస్యలు వస్తే…ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలి. అంతేకానీ నేను చెబితే విన్నరా…నీ వల్లె ఇలా జరిగింది…అంటూ విమర్శించుకోవద్దు. గొడవలు సులభం కానీ…అవి మామూలుగా అవడం చాలా కష్టం. కాబట్టి ఎలాంటి వ్యవహారాలైనా సరే…సున్నితంగా మాట్లాడుకోవడం మంచిది.

హద్దులు పెట్టొద్దు:
మీ భాగస్వామిపై కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. వారి నుంచి తనను దూరం చేయాలని ప్రయత్నించకూడదు. వారి మాటలకు అనాలోచితంగా తల ఊపకుండా చేయగలరు. అదీ సానుకూల పద్దతిలో మాత్రమే ఉండాలి.

Exit mobile version