భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎక్కువసార్లు గొడవ పడుతూ ఉంటారు. ఇలా గొడవ పడడానికి ఇతర కారణాలతో పాటుగా పడకదిలో వాస్తు దోషం ఉన్నా కూడా భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయట. అయితే పడకగదిలో వాస్తు దోషం ఆర్థిక సంక్షోభంతో పాటుగా ఆరోగ్య సంబంధ సమస్యలు కూడా వస్తాయట. ఇకపోతే వాస్తు శాస్త్రం మన పడకగది నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మరి వాస్తు శాస్త్ర ప్రకారం మన పడకగది ఏ విధంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భార్యాభర్తలు పడకగదిలో 7 నుంచి 9 గంటలు సేపు గడుపుతారు. కాబట్టి మీకు వాస్తు ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నియమాలు పాటించడం వల్ల ఈ వాస్తు ప్రభావం వల్ల కలిగే తప్పించుకోవచ్చు. మొదటి పడకగది నైరుతి దిశలో ఉండాలి. మంచం కూడా ఈ మూలలో మాత్రమే ఉంచాలి. అలాగే వాస్తు ప్రకారం మీ పడకను ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. దీనివల్ల మీరు సరిగ్గా నిద్రపట్టక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. పడకగదిలో పూజ చేయరాదు.
అంతేకాకుండా పడక గదిలో చాలీసా, గ్రంథం లేదా ఏదైనా ఇతర మతపరమైన పుస్తకాన్ని ఉంచినట్లయితే, వాటిని కూడా ఇక్కడి నుంచి తీసివేయాలి. ఒకవేళ పడకగదిలో అద్దం పెడితే మంచం ముందు పెట్టకూడదు. బెడ్ రూమ్ గోడల పై పగుళ్లు ఉండకూడదు. ఒక వేళ పగుళ్ళు ఉంటే వెంటనే సరిదిద్దాలీ. విరిగిన గోడలు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే పడకగదిలో హింసాత్మక ఫోటోలను ఉంచకూడదు. జంతువులు లేదా జీవుల చిత్రాలను పోస్ట్ చేయవద్దు. దేవతల కోపంతో కూడిన భంగిమను కూడా ఉంచకూడదు. బెడ్ రూమ్ లో, బెడ్ పైన గోడపై గడియారం లేదా ఫోటో ఫ్రేమ్ ఉంచవద్దు. ఇది తలనొప్పికి కారణమవుతుంది. అలాగే పడకగదిని అలంకరించడానికి, ప్రేమను చూపించే లేదా ప్రకృతితో నిండిన చిత్రాలను ఉపయోగించండి. ఇది మనశ్శాంతిని ఇచ్చి ప్రశాంతతను కాపాడుతుంది.