Site icon HashtagU Telugu

పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ ఐదు మొక్కలు అస్సలు పెంచుకోకండి.. అవేంటో తెలుసా?

Houseplants In Bottles

Houseplants In Bottles

మామూలుగా మనం వాస్తు ప్రకారం ఎన్నో రకాల విషయాలను పాటిస్తూ ఉంటాం. అటువంటి వాటిలో మొక్కలను పెంచుకోవడం కూడా ఒకటి. చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. కానీ అందులో వాస్తు ప్రకారంగా కొన్ని మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు. అలాంటి మొక్కలు (Plants) పెంచుకోవడం వల్ల దురదృష్టాన్ని వెంటపెట్టుకున్నట్టే అవుతుంది. ముఖ్యంగా ఐదు రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదట. ఇంతకీ ఆ ఐదు రకాల మొక్కలు ఏంటి అవి పెంచుకుంటే ఎలాంటి అశుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కాక్టస్.. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం, కాక్టస్ లేదా బ్ర‌హ్మ‌జెముడు జాతిమొక్కను ఇంట్లో అసలు పెంచుకోకూడదు. ఎందుకంటె కాక్టస్ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది. దాని ఆకులపై ఉన్న పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. కాక్టస్ మొక్క ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది. ఇది కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. దాంట్లో ఇంట్లో వాళ్ల మధ్య మనస్పర్ధలు కూడా మొదలవుతాయి. వాస్తు ప్రకారంగా ఇంట్లో పెంచుకోకూడని మొక్కలలో పత్తి మొక్క కూడా ఒకటి. ఇంటి లోపల పత్తి మొక్కను నాటుకోవడం వల్ల దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. వాస్తు ప్రకారం గా పత్తి మొక్కలు (Plants) మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.

బోన్సాయ్ మొక్క.. ఇంట్లో బోన్సాయ్ మొక్కలు పెంచుకోవడం వాస్తు శాస్త్రంలో నిషేధించారు. ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఆ మొక్క మీ పురోగ‌తిని అడ్డుకుంటుంది. ఇది వారి కెరీర్ లేదా వ్యాపారంలో ఎదురుదెబ్బకు దారితీయవచ్చు. అలాగే వాస్తు ప్రకారంగా ఇంట్లో పెంచుకోకూడని మొక్కలలో చింత మొక్క కూడా ఒకటి. చింత మొక్కలు (Plants) ఇంటి లోపల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ చింతమొక్కలను అస్సలు నాటకూడదు. అలాగే ఇంట్లోని వ్య‌క్తుల‌ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. దీంతో ఇంట్లో నిత్యం భయాందోళనలు నెలకొంటాయి. కాగా ఇంట్లో పెంచుకోకూడని మరొక మొక్క గోరింటాకు మొక్క.

ఈ గోరింటాకు మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే దుష్టశక్తులు ఎల్లప్పుడూ ఈ మొక్కలలో నివసిస్తాయి. అదేవిధంగా ఈ మొక్కల వాసన బలంగా ఉండి మానసిక ప్రశాంతతను ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పైన చెప్పిన ఐదు రకాల మొక్కలను మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంట్లో పెంచుకోకపోవడమే మంచిది. పొరపాటున వాటిని తెచ్చి పెంచుకుంటే దురదృష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టే అవుతుంది.

Also Read:  Guava Leaf Juice : జామ ఆకుల రసం తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?