Site icon HashtagU Telugu

Ghee Effects: ఈ రోగాలున్నవారు నెయ్యిని అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

Ghee

Ghee

Ghee Effects: నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చాలామంది నెయ్యి అతిగా ఇష్టపడి తింటూ ఉంటారు. మరి కొంతమంది నెయ్యిని తినడానికి ఇష్టపడరు. కొంతమంది ఈ నెయ్యిని ఆహారంలో కలుపుకొని తింటే మరి కొంతమంది స్వీట్స్ అలాగే ఇతర ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటూ ఉంటారు. వేడివేడి అన్నం, పప్పు అందులో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వైద్య నిపుణులు కూడా ప్రతిరోజు ఒక టీస్పూన్ నెయ్యిని తినమని చెబుతూ ఉంటారు.

అయితే నెయ్యిని తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు నెయ్యిని తినడం అస్సలు మంచిది కాదు. నెయ్యిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు నెయ్యిని అస్సలు తినకూడదు. కడుపునొప్పి అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యి ని తినకపోవడమే మంచిది. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యిని తింటే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే లివర్ సిర్రోసిస్ సమస్యతో బాధపడే వారు నెయ్యి ని పూర్తిగా తినకపోవడమే మంచిది.

అటువంటి వారు నెయ్యి తినడం ఈ వ్యాధిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా కాలేయం శాశ్వతంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అలాగే డబ్బు జలుబు లాంటి సమస్యలతో బాధపడే వారు నీకు దూరంగా ఉండాలి. ఇలా దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు నెయ్యిని తింటే ఆ గొంతు నొప్పి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దగ్గు విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా సీజనల్ ఫీవర్ తో బాధపడే వారు కూడా నెయ్యిని తినకపోవడమే మంచిది. సీజనల్ ఫీవర్ సమయంలో నెయ్యి ని జ్వరంతో పాటు దగ్గు కూడా వస్తుంది. జ్వరం మరింత ఎక్కువ అవుతుంది.

Exit mobile version