Site icon HashtagU Telugu

Kidney Damage: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఫుడ్ అస్సలు తినకండి!

Kidney

Kidney

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీలో సమస్య కూడా ఒకటి. అయితే దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఈ కిడ్నీ స్టోన్స్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కిడ్నీలు మన శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ ప్రక్రియలో, కాల్షియం, సోడియం ఇంకా అనేక ఇతర ఖనిజాల కణాలు మూత్రాశయం ద్వారా మూత్రాశయంలోకి వచ్చి చేరతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కిడ్నీలో సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..విటమిన్ సి ఆహార పదార్థాలకు కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు దూరంగా ఉండాలి. విటమిన్ సి వల్ల కిడ్నీ లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి నిమ్మకాయలు, పాలకూర, నారింజ, కివీస్ బేరి వంటి వాటిని తినకుండా ఉండటం మంచిది. అలాగే శీతల పానీయాలు అనగా టీ కాఫీ వంటి వాటికీ కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది.

ఈ కాఫీ, టీ వంటి వాటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం చాలా ప్రమాదకరం. కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారు ఉప్పు లేదా లవణం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో వాటిలో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల అది కిడ్నీని దెబ్బతీస్తుంది. కిడ్నీ స్టోన్ రోగులకు మాంసాహారం అనగా చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకం శరీరానికి శరీరానికి ఎంత ముఖ్యమో, అలాగే మూత్రపిండాల పై అంతే ప్రభావాన్ని చూపుతుంది.

Exit mobile version