No Non Veg Days: ఈ వారాల్లో మీరు మాంసాహారం అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

భారత్ లో చాలామంది హిందువులు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాంసాహారాన్ని తినరు. మరి ముఖ్యంగా

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 02:00 PM IST

భారత్ లో చాలామంది హిందువులు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాంసాహారాన్ని తినరు. మరి ముఖ్యంగా సోమవారం, గురువారం, శనివారం మాంసాన్ని తినరు. వీటితో పాటుగా అప్పుడప్పుడు పండుగలకు వ్రతాలకు ఇంట్లో పూజలకు ఇలా చాలా సందర్భాల్లో మాంసాన్ని ముట్టుకోరు. మన దేశంలో సంస్కృతి,సంప్రదాయాలకు ఎక్కువగా విలువ ఇస్తుంటారు. మన పూర్వికుల నుంచి వారంలో కొన్ని రోజులు మాంసం తినకుండా ఉండే అలవాటు ఉంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. వారం మొత్తం మాంసాహారమేతింటే ఈ భూమి పై జీవరాశి మనుగడ లేకుండా పోతుంది. అందుకే వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను, పక్షులను చంపడం హిందువులు పాపం గా భావిస్తారు.

ఆ రోజు మాంసం తినడం కూడా మంచిది కాదని భావిస్తారు. రోజూ మాంసం తినడానికి అలవాటు బాడీకి కావాల్సిన ఐరన్, విటమిన్ B12, ఇతర కీలకమైన పోషకాలన్నీ మాంసం తినడం ద్వారా అందుతాయి. అందుకే అప్పుడప్పుడు మాంసం తినాలిన మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. కానీ మనిషి రోజూ మాంసం తినడానికి అలవాటు పడ్డారు. చాలామందికి రోజు కూడా ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాగే ప్రతిరోజు కూడా మాంసం తినడం కూడా ఆరోగ్యానికి అంతమంచిది కాదు. ప్రతిరోజు మాంసాహారం తినడం వల్ల ఫైల్స్ వస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. పెద్దపేగు కాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది.

అలాగే రక్తపోటు, గుండెపోటు బారినపడే అవకాశం ఉంది. అందువల్ల హిందూమత్రం ప్రకారం కొన్ని ఆచారాలను సంప్రదాయాలను ఏర్పరిచారు. ఇలాగైనా రోజూ మాంసాహారం తినడం మానుకుంటారనే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనపెద్దలు. ముఖ్యంగా దేవుణ్ని పూజించే వారు తినకూడదని సోమవారం రోజూ శివుడు, గురువారం సాయిబాబా, శనివారం వెంకటేశ్వర స్వామి ఇలా ఒక్కోవారం ఒక్కో దేవుడికి సంబంధించినది కాబట్టి రోజు మాంసాన్ని ముట్టకూడదని మన పెద్దలు నిర్ణయించారు. కాబట్టి మీ ఇష్ట దైవానికి సంబంధించిన రోజైనా మాంసాన్ని ముట్టకుండా ఉండండం మంచిది..