Site icon HashtagU Telugu

Shower Tips: తల స్నానం చేసేటప్పుడు ఈ పనులు చెయ్యకండి.. ఇలా చేస్తే మంచిది!

Head Bath

Head Bath

సాధారణంగా చాలామంది ఈ ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు స్నానం చేయడం అన్నది కూడా దినచర్య గా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది రోజు విడిచి రోజు స్నానం చేస్తే మరి కొందరు మాత్రం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు. ఈ స్నానం చేసే సమయంలో కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్నానం చేస్తూ తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. తిన్న తర్వాత స్నానం చేయడం, లేదంటే రకరకాల షాంపూలను ఉపయోగించి స్నానం చేయడం, తల స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ లను ఉపయోగించడం ఇలా అనేక రకాలుగా తప్పులు చేస్తూ ఉంటారు.

అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేడి నీటితో తలస్నానం చేస్తే వేగంగా డ్రై అవుతాయట. అలాగే చన్నీటితో స్నానం చేస్తే షాంపూ కండిషనర్లు లాంటివి వెంట్రుకలకు బాగా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. అయితే షాంపుతో తల స్నానం చేసే ముందుగా వెంట్రుకలను నీటితో బాగా కడుక్కోవాలి. అదేవిధంగా షాంపూని తలకు రాసుకునే ముందు ఒకటికి రెండు సార్లు తలని బాగా నీటితో తడుపుకోవాలి.

ఈ విధంగా ఒకటి రెండు నిమిషాల ముందే చేయాలి. ఆ తర్వాత తలకు షాంపూ లాంటివి అప్లై చేయాలి. ఎప్పుడూ కూడా వేగంగా తొందరగా తలస్నానం చేయకూడదు. తలకు అప్లై చేసిన కండిషనర్లు షాంపూలు పోయే వరకు తల స్నానం చేయాలి. కొంతమంది ఏవో పనులు ఉన్నాయి అని తొందర తొందరగా స్నానాలు చేయడం, తలకు షాంపు అలాగే ఉండంగానే తలను హెయిర్ డ్రైయర్లు, టవల్ లాంటి వాటిని ఉపయోగించి పొడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు.