Diapers: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత మంచి విషయాలకంటే చెడ్డ విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రజలను భయపెట్టే విషయాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి వాటిలో డ్రైపర్లు వేస్తే చిన్నపిల్లలకు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి కిడ్నీ సమస్యలు వస్తాయి అన్న విషయం కూడా ఒకటి. ఈ విషయం మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే శిశు వైద్య నిపుణుల ప్రకారం ఈ వాదన పూర్తిగా తప్పు. పిల్లలకు డైపర్ వేయడం వల్ల పిల్లల కిడ్నీలపై ఎటువంటి ప్రభావం ఉండదట. డైపర్ పని పిల్లల టాయిలెట్ ని పీల్చుకోవడం, తద్వారా పిల్లలు తడిగా ఉండకుండా చూసుకోవడం మాత్రమే చేస్తాయని చెబుతున్నారు. కిడ్నీలు శరీరం లోపల ఉంటాయి. వాటి పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం. కాబట్టి డైపర్ల వల్ల కిడ్నీలకు ఎటువంటి హాని జరగదట. ఒకవేళ పిల్లలు ఎక్కువ సమయం పాటు తడి డైపర్ వేసుకుని ఉంటే చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తడి డైపర్లలో బ్యాక్టీరియా పెరుగుతుందట.
ఇది పిల్లల మూత్ర మార్గాలకు చేరుకుంటుందని, కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియానే UTIకి కారణమవుతుందని, అయినప్పటికీ UTI సమస్యలు చాలా సందర్భాలలో నయమవుతుందని, ఇది కిడ్నీ ఫెయిల్ వంటి తీవ్రమైన సమస్యగా మారదని అందువల్ల సమయానికి డైపర్ మార్చడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. డైపర్ ఎక్కువ తడిగా కనిపించకపోయినా రోజుకు 3 నుంచి 4 గంటలకు ఒకసారి మార్చాలట. పిల్లలు మలం విసర్జన చేస్తే వెంటనే డైపర్ మార్చాలని, ఎందుకంటే మురికి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశుభ్రతను కాపాడుకోవడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని చెబుతున్నారు. డైపర్ మార్చిన తరువాత శిశువు చర్మాన్ని బేబీ వైప్స్ లేదా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలట. తరువాత చర్మాన్ని కొన్ని సెకన్లపాటు ఆరనివ్వాలని, అవసరమైతే చర్మం మృదువుగా, సురక్షితంగా ఉండటానికి తేలికపాటి బేబీ క్రీమ్ లేదా రాష్ క్రీమ్ ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
Diapers: ఏంటి.. పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు సమస్యలు వస్తాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Diapers