DIY Lip Balm: అందాన్ని మరింత పెంచే లిప్‌బామ్‌ ను సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

చలికాలం వచ్చింది అంటే పెదవులు స్కిన్ పగలడం, డ్రై గా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీ

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 09:00 PM IST

చలికాలం వచ్చింది అంటే పెదవులు స్కిన్ పగలడం, డ్రై గా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్, లిప్‌బామ్‌ ను ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు రకరకాల ఫేస్ క్రీమ్స్,లిప్‌బామ్‌, కొబ్బరి నూనె వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది లిప్‌బామ్‌ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్ లో లభించే లిప్‌బామ్‌ లలో రకరకాల కెమికల్స్ కలుస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది వాటిని వినియోగించడానికి అంతగా ఇష్టపడడం లేదు.

అలాగే చాలామంది వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో అని భయపడుతున్నారు. అయితే ఇక మీదట సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న భయం అక్కర్లేదు. మార్కెట్ లో దొరికే ఆ లిప్‌బామ్‌ ను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇందుకోసం.. కొబ్బరి నూనె – 1 టీస్పూన్‌, పెట్రోలియం జెల్లీ – 1 టీస్పూన్ తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీని పాన్‌లో వేసి కరిగించాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె వేసి మిక్స్‌ చేయాలి. దీన్ని ఫ్రీజర్‌లో పెట్టి స్టోర్‌ చేయాలి. దీన్ని మీకు కావాలి అనుకున్నప్పుడు ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే మరొక రెమిడీ విషయానికి వస్తే..

ఇందుకోసం కొబ్బరి నూనె 2 టేబుల్‌ స్పూన్లు, కోకో బటర్ – 1 టేబుల్‌ స్పూన్‌ తీసుకోవాలి. తర్వాత పాన్‌లో వేసి కోకో బటర్‌ను కరిగించాలి. దీన్ని కొబ్బరి నూనెలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక గాజు కంటైనర్‌ లోకి తీసుకుని స్టోర్‌ చేయాలి. అవసరం ఉన్నప్పుడు వాటిని తీసుకొని అప్లై చేసుకోవచ్చు. లిప్‌ బామ్‌ 3 రెమిడి విషయానికి వస్తే.. కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్, జోజోబా ఆయిల్‌ – 5 చుక్కలు తీసుకోవాలి. కొబ్బరి నూనెలో జోజోబా ఆయిల్‌ వేసి బాగా కలపాలి. దీన్ని ఫ్రీజర్‌లో స్టోర్‌ చేసుకోవచ్చు. ఈ విధంగా పైన చెప్పిన వాటిని తయారు చేసి ఇంట్లోనే స్టోర్ చేసుకోవడంతో పాటు అవసరం ఉన్న ప్రతిసారి ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.