Diwali Sweets : దీపావళికి బంగారంతో తయారు చేసిన స్వీట్స్…కేజీ ధర ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. !!

ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే...బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 08:31 AM IST

ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే…బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి. ఈ స్వీట్స్ రుచి మామూలుగా ఉండదు. ధర కూడా ఉంటుందనుకోండి. బంగారు స్వీట్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు…దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని అమరావతిలో రఘువీర్ అనే స్వీట్ షాపులో బంగారంతో తయారు చేసిన స్వీట్ల అమ్మకాలు ప్రారంభించింది. బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలించాయి. మహారాష్ట్రలో దీపావళి ఘనంగా జరుపుకుంటారు. శరద్ పూర్ణిమకు తర్వాత రోజు ఈ పండగ వస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు ఈ పండగను స్వీట్స్ తో సెలబ్రెట్ చేసుకుంటారు. అందుకే స్వీట్ షాపు యజమాని చంద్రకాంత్ పోపాట్..డ్రై ప్రూట్స్ తో స్వీట్స్ ను తయారు చేసి దానికి బంగారు పూత పూసారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని..చెబుతున్నాడు.

బాదం, పిస్తాతోపాటు ఇతర డ్రైఫ్రూట్స్ తో ఈ బంగారు స్వీట్స్ తయారు చేశారు. ఈ స్వీట్స్ కేవలం అమరావతిలోనే కాదు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందట. ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపిస్తున్నట్లు రఘువీర్ తెలిపారు. ఈస్వీట్స్ చూసేందుకు కస్టమర్లు దుకాణానికి క్యూ కట్టారు. ఆరోగ్యానికి హానిచేసే క్రాకర్లను తక్కువగా కాల్చుతూ..ఆరోగ్యానికి మేలు చేసే ఈ స్వీట్స్ ఎక్కువగా తినేందుకు ప్రయత్నిస్తామని కస్టమర్ తెలిపారు.

ఇక ఈ స్వీట్ కిలో ధర 11వేల రూపాయలుగా డిసైడ్ చేశారు. సాధారణంగా స్వీట్స్ నాణ్యతవి అయితే 600 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి.