Divorce With Wife: భార్యతో విడాకులు.. ఆనందంలో యువకుడి బంగీ జంప్.. చివరికి ప్రాణాలే..

ఇటీవల భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండటం లేదు. చిన్నపాటి విషయాలకు గొడవలు పడి విడాకులు తీసుకునే వరకు వెళుతున్నారు. చిన్న చిన్న విషయాలు కాపురాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 05 08 At 20.19.54

Whatsapp Image 2023 05 08 At 20.19.54

Divorce With Wife: ఇటీవల భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండటం లేదు. చిన్నపాటి విషయాలకు గొడవలు పడి విడాకులు తీసుకునే వరకు వెళుతున్నారు. చిన్న చిన్న విషయాలు కాపురాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఒకరినొకరు అర్ధం చేసుకోవడం వల్ల మనస్పర్థలు వస్తున్నాయి. దీని వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

కానీ ఇటీవల విడాకుల సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఒక మహిళ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఫొటోషూ్ తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్త ఫొటోను చంపేయడం, కాళ్ల కింద పెట్టి తొక్కడంపై విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఓ యువకుడు విడాకులు తీసుకున్న ఆనందంలో సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

బ్రెజిల్ కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస తోస్టా అనే వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ సందర్బంగా ఆనందంలో బంగీ జంప్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం బ్రెజిల్ లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్ లో పాల్గొనడానికి వెళ్లాడు. 70 అడుగులు ఎత్తు నుంచి తాడు సాయంతో బంగీ జంప్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యలో తాడు తెగిపోవడంతో అతడు నీటి కోలనులో పడ్డాడు.

బాగా ఎత్తు నుంచి పడటంతో రాఫెల్ మెడ విరిగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకుని ఇటీవల బయటపట్టాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో జరగ్గా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.భార్యతో విడాకులు తీసుకోవడంతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నాడని, ఆనందంలో బంగీ జంప్ చేస్తానని రాఫెల్ చెబుతున్నాడు. కానీ ఇలా ప్రమాదం జరుగుతుందని అసలు అనుకోలేదని, చాలా భయం వేసిందన్నాడు .చివరికి ప్రాణాలతో బయపడ్డానని అంటున్నాడు.

  Last Updated: 08 May 2023, 11:40 PM IST