Site icon HashtagU Telugu

Boiled Water : గుడ్లు ఉడికించిన నీళ్లు పారపోయకుండా…ఇలా చేసి చూడండి..ఆశ్చర్యపోతారు..!!

Boild Egg

Boild Egg

ఉడికించిన గుడ్డు…ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలుసు. గుడ్డు ఉడికించిన తర్వాత నీళ్లు ఏం చేస్తారు. పారబోస్తారు అంతే కదా. ఇక్కడే పొరపాటు చేయకండి. ఉడికించి గుడ్డే కాదు…గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు కూడా మంచివే. ఎలాగో తెలుసా. కోడిగుడ్డులోని పెంకుల్లో కాల్షియం ఉంటుంది. గుడ్లను ఉడకబెట్టినప్పుడు అందులోని కాల్షియం నీటిలో కరుగుతుంది. కాల్షియం ఒక్కటే కాదు…ఇందులో ఇంకా ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి.

గుడ్డు పెంకులో 95శాతం కాల్షియం కార్పోనేట్ ఉంటుంది. భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, వంటి మూలకాలు కూడా ఉంటాయి. గుడ్డు ఉడకబెట్టినప్పుడు అవన్నీ నీటిలో కరుగుతాయి. అవి సాధారణ మినరల్ వాటర్ గా మారుతాయి. ఈ నీటిని మొక్కలకు ఉపయోగిస్తే…వాటికి మంచి పోషకాలను అందించినట్లవుతుంది. మొక్కల పోషణకు ఎరువుగా పనిచేస్తుంది.

గుడ్డు ఉడకబెట్టిన నీళ్లు మాత్రమేకాదు…గుడ్డు పెంకులు కూడా ఎరువుగా ఉపయోగపడతాయి. మొక్కలు డైరెక్టుగా పెంకులు వేయడం కంటే ఉడకబెట్టిన గుడ్ల నీటిని పోస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే నీళ్లు వేడిగా ఉన్నప్పుడు మొక్కలకు పోయకూడదు. చల్లారిన తర్వాత మొక్కలకు పోయాలి. ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు, విత్తనాలు చల్లేటప్పుడు…ఈ ఉడకబెట్టిన గుడ్ల నీళ్లు చాలా ఉపయోగపడతాయి.

గుడ్డు పెంకులను పొడిగా చేసి…మొక్కలు నాటిన మట్టిలో కలిపితే… మట్టి మరింత ఫెర్టెల్ గా మారుతుంది. చాలామంది ఇదే పని చేస్తుంటారు. ఈ నీరు టామోటో మొక్కలకు మంచి పోషణను ఇస్తుంది. సూర్యరశ్మి ఎక్కువగా అందని మొక్కలకు ఈ నీరు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. మిర్చి, వంగ మొక్కల్లో ఈ నీరు ఉపయోగించవచ్చు. అంతేకాదు మొక్కలు తెగుళ్లను ఎదుర్కొనే శక్తి వాటికి లభిస్తుంది.