Site icon HashtagU Telugu

Health Tips: మధుమేహం ఉన్నవాళ్లు మద్యం తీసుకోవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Diabetes Test Imresizer

Diabetes Test Imresizer

సాధారణంగా మద్యాన్ని ఎప్పుడు మితిమీరి సేవించ కూడదు. సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా బీపీ, లేదా డయాబెటీస్ తో బాధ పడుతున్నవారు వారు ఆల్కహాల్ తీసుకునే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు వారానికి ఎనిమిది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల ఆల్కహాల్ తీసుకుంటే వారికి హైబీపీ వచ్చే ముప్పు పెరుగుతుందట. కాగా మోడరేట్ గా ఆల్కహాల్ తీస్కున్నా కూడా ఈ రిస్క్ ఉందా అన్ని విషయం మీద పరిశోధనలు నిర్వహించగా అందులో వారానికి ఎనిమిది గ్లాసుల కంటే ఎక్కువ ఆల్కహల్ తీసుకునే వారికి హైబీపీ, బ్లడ్ షుగర్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వచ్చే రిస్క్ అరవై శాతం పెరుగుతుందట.

అయితే రోజుకి ఒక డ్రింక్ కన్నా ఎక్కువ తీసుకోకపోతే ఈ డిసీజెస్ వచ్చే రిస్క్ పెద్దగా లేదని ఈ స్టడీ ద్వారా తెలిసింది. అయితే, ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదనీ, రోజుకి ఒక డ్రింక్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకున్న సమస్యల కాక ఇంకా హెల్త్ సమస్యలు కూడా వస్తాయి. ఆల్కహాల్ ని ఎక్కువ గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ యొక్క ఫ్రంటల్ లోబ్స్ ష్రింక్ అవుతాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువ కన్‌స్యూం చేసేవారు వారి ప్రవర్తన మీద అధికారాన్ని కోల్పోతారు. డెసిషన్ మేకింగ్ పవర్ పూర్తిగా పోతుంది.

మెదడు జ్ఞాపకాలను స్టోర్ చేసుకునే ప్రాసెస్ తో ఆల్కహాల్ ఇంటర్ఫియర్ అవుతుంది. దానివల్ల తాగినప్పుడు ఏం చేశారో అసలు గుర్తుకు ఉండదు. ఆల్కహాల్ మీద బాగా డిపెండ్ అయిపోయిన వారు ఈ అలవాటు లోనుండి బయట పడాలని చేసే ప్రయత్నంలో ఎన్నో చిరాకులు ఎదుర్కొంటారు. వాటిలో భ్రమకీ, భ్రాంతికీ లోనవడం కూడా ఒకటి.

Exit mobile version