Site icon HashtagU Telugu

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Coconut water

Coconut water

Diabetes: కొబ్బరి నీరు ఈ సహజ పానీయంలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఈ కొబ్బరి నీటిని చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కొబ్బరి నీరు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. అలాగే తక్కువ కేలరీల పానీయంతో పాటు, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, బి,కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో 94% నీరు ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది.

కొబ్బరి నీరు తాగడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెద్దగా పెరగవు. కొబ్బరి నీరు హైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. కాబట్టి వేడి వాతావరణంలో ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీటిని తాగవచ్చా? కొబ్బరి నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీళ్ల వినియోగం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించవచ్చని చాలా జంతువుల పై చేసిన పరిశోధనలో తేలిందట. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 % కంటే తక్కువగా ఉంటుంది. కావున ఇది డయాబెటిక్ రోగులకు హానికరం కాదంటున్నారు. అయితే ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీరు తాగాలి అనుకుంటే వైద్యుల సూచనల మేరకు ఎంత మోతాదులో తాగాలి అన్నది వైద్యులను సంప్రదించి ఆ తర్వాత తాగడం మంచిది అని అంటున్నారు.

Exit mobile version