Site icon HashtagU Telugu

Dry Flower Dhoop : పూజకు ఉపయోగించిన పూలతో.. పడేయకుండా ధూపం ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసా?

Dhoop and Sambrani Sticks made with Used and Dry Flowers

Dhoop and Sambrani Sticks made with Used and Dry Flowers

మనం గుడికి(Temple) వెళ్ళినప్పుడు మనకు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. దానికి కారణం అక్కడ వచ్చే వాసన, శబ్దాలే కారణం. అయితే అక్కడ ఉండే పూలు(Flowers), అగరబత్తులు, ధూపం(Dhoop) ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతత ను కలిగిస్తాయి. అయితే మనం ఇప్పుడు వాడే వన్నీ కల్తీ అవుతున్నాయి. మనం పూజకి ఉపయోగించే ధూపం, అగరబత్తీలలో కూడా బోల్డన్ని కెమికల్స్ ఉంటున్నాయి. అందుకే మనం చాలా తేలికగా ఇంటిలో పూజకు ఉపయోగించిన పూలతో ధూపాన్ని తయారుచేసుకోవచ్చు.

మనం పూజ అయ్యాక పూజలో వాడిన పూలని చెట్లల్లో లేదా దగ్గర కాలువలు, చెరువుల్లో పడేస్తూ ఉంటాము. సిటీల్లో ఉండేవాళ్ళకి పూజకి వాడిన పూలని ఎక్కడ పడేయాలి తెలియదు. చెత్తలో పడేయాలంటే మనసొప్పదు. అందుకే ఎవరైనా సరే పూజకి వాడిన పూలని పడేయకుండా ధూపం తయారుచేసుకోవచ్చు.

ఇంటిలో ధూపం తయారుచేయడానికి కావలసిన పదార్థాలు..

* పూజకు ఉపయోగించిన పూలు కొన్ని
* గులాబీ పువ్వులు 8
* లవంగం ఆకులు రెండు
* కర్పూరం మూడు
* బొగ్గు మరియి పొడి పేడ
* చందనం పొడి
* రెండు స్పూన్ల నువ్వుల నూనె
* ఒక స్పూన్ తేనె
* మూడు స్పూన్ల నెయ్యి
* హవాన్ పొడి (సాంబ్రాణి)

ధూపం తయారు చేయు విధానం..

ముందు పూలని ఒకరోజు ఎండలో బాగా ఎండబెట్టాలి. అనంతరం ఒక మిక్సి గిన్నెలో ఎండిన పూలు, గంధం, కర్పూరం, హవాన్ పొడి, లవంగం ఆకులు, బొగ్గు మరియు పొడి పేడ కలిపి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని జల్లెడ పట్టుకోవాలి. ఈ పొడిలో తేనె, నువ్వుల నూనె, నెయ్యి కలుపుకొని గొట్టం లాగా, పిరమిడ్ లాగా లేదా మనకు కావలసిన ఆకారాన్ని చేసుకోవచ్చు.

అనంతరం వాటిని ఎండలో పెట్టి ఆరబెట్టాలి. ఈ విధంగా మనం రోజూ పూజలో ఉపయోగించే పూలను ధూపం లాగా తయారుచేసుకోవచ్చు. ఇది కెమికల్స్ కలపనిది కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది ఇంకా దీనిని రోజూ మన ఇంటిలో వెలిగించుకోవడం వలన మన ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇప్పుడు చాలామంది దీన్ని కుటీర పరిశ్రమగా కూడా పెట్టి గుళ్ల నుంచి వాడిన పూలు కలెక్ట్ చేసి వాటితో ధూపం, అగరబత్తీలను తయారుచేసి డబ్బు కూడా సంపాదిస్తున్నారు.

 

Also Read : Besan Flour : శనగపిండితోనే అందం.. ముఖం కాంతివంతంగా మారాలంటే..

Exit mobile version