Site icon HashtagU Telugu

Ema Datshi : దీపికా పదుకొనే ఫేవరేట్ ఫుడ్ ‘ఈమా దత్షి’ ఎలా చేయాలో తెలుసా?

Deepika Padukone Favorite Food Ema Datshi Preparing Process

Deepika Padukone Favorite Food Ema Datshi Preparing Process

దీపికా పదుకొనే(Deepika Padukone) ఓ సారి భూటాన్(Bhutan) వెళ్ళినప్పుడు అక్కడ ‘ఈమా దత్షి'(Ema Datshi) అనే వంటకం తింది. ఈమా దత్షి దీపికా పదుకొనేకి బాగా నచ్చేసింది అంట. దాంతో అది ఎలా తయారుచేయాలో కూడా నేర్చుకొని రెగ్యులర్ గా చేసుకొని తింటుందట. అలాగే భూటాన్ లో చాలా ఫేమస్ ఫుడ్ ఈమా దత్షి.

తాజాగా దీపికా పదుకొనే ఓ ఇంటర్వ్యూలో ఈమా దత్షి తన ఫేవరేట్ ఫుడ్ అని చెప్తూ దాన్ని ఎలా తయారుచేయాలో వివరించింది.

ఈమా దత్షి తయారుచేయడానికి కావలసిన పదార్థాలు..

టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు, ఉప్పు, నల్ల మిరియాలు, నూనె, నీరు,నెయ్యి, చీజ్, మసాలా..

ఈమా దత్షి తయారుచేయు విధానం..

ఒక పాన్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు, నల్ల మిరియాలు వేసి ఒక కప్పు నీరు పోసి కూరగాయాలన్నింటిని కలబెట్టి మూత పెట్టాలి. మంట పెద్దది చేసి ఒక పది నిముషాలు వాటిని బాగా ఉడకనివ్వాలి. అనంతరం మాన్తా తగ్గించి కొద్దిగా నెయ్యి, చీజ్, మసాలా, నల్ల మిరియాలు వేయాలి. కాసేపు ఆ మిశ్రమం కలిపినా తర్వాత వేడి వేడి ఈమా దత్షి రెడీ అయినట్లే.

దీనిని అన్నం లేదా చపాతీ లకు పెట్టుకొని తినవచ్చు. భూటాన్ భాషలో ఈమా అంటే మిరపకాయ అని, దత్షి అంటే చీజ్ అని అర్ధం. అందుకే దీనికి ‘ఈమా దత్షి’ అని పిలుస్తారు. మీరు కూడా ఈమా దత్షి ట్రై చేయండి.

 

Also Read : Eagle Ott: ఓటీటీలోకి రవితేజ ఈగల్ మూవీ ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?