Site icon HashtagU Telugu

Watermelon Beauty Benefits: పుచ్చకాయతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?

Watermelon Beauty Benefits

Watermelon Beauty Benefits

మామూలుగా చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జిడ్డు, మొటిమలు, చికాకు,పింపుల్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని తొలగించుకోవడం కోసం చర్మ సమస్యలను దూరం చేసుకోవడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే చర్మ సమస్యలను దూరం చేయడంలో పుచ్చకాయ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్‌, సి పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి.

వీటితో పాటుగా పుచ్చకాయలోని లైకోపీన్‌, బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కుంగిపోయిన చర్మాన్ని రిఫ్రెష్‌ చేస్తాయి. సన్‌బర్న్‌‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి. మరి పుచ్చకాయతో మీ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ జ్యూస్‌ తాగితే మన శరీరానికి రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఫ్రెష్‌గా చేస్తుంది. దీని హైడ్రేటింగ్ ప్రాపర్టీస్‌ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇది బయట నుంచి ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది. పుచ్చకాయలో విటమిన్‌ సి మెండుగా ఉంటుంది.

ఇది చర్మాన్ని లోపల నుంచి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. పుచ్చకాయ జ్యూస్‌ తాగినా, మీ బ్యూటీ కేర్‌లో యాడ్‌ చేసుకున్న మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఎండాకాలంలో చర్మం ఎక్కువగా ఎండకు గురికావడం వల్ల వడదెబ్బలు, చికాకు ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. పుచ్చకాయ విసుగు చెందిన చర్మాన్ని శాంతపరుస్తుంది. పుచ్చకాయ గుజ్జు మొటిమలపై అప్లై చేస్తే ఎరుపును తగ్గించి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయ లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ పోరాడతాయి. ఇవి గీతలు, ముడతలను తగ్గించి.. చర్మాన్ని స్టిఫ్‌గా చేస్తాయి. పుచ్చకాయలోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి.

పుచ్చకాయలో విటమిన్‌ ఏ, బి,సి వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి తోడ్పడతాయి. పుచ్చకాయలలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది సేబాషియస్ గ్రంధులను ప్రేరేపిస్తుంది. తద్వారా సెబమ్‌ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. జుడ్డు చర్మంతో బాధపడేవారికి పుచ్చకాయ బెస్ట్‌ ఆప్షన్‌ మీరు మొటిమల సమస్యతో బాధపడుతుంటే పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే చర్మంపై చికాకు, ఎరుపుదనం తగ్గుతుంది.

Exit mobile version