Dark Circles: కంటికింద నల్లటి వలయాలు పోవాలంటే ఇలా చేయాల్సిందే?

ఈ రోజుల్లో యువతని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య కళ్ళ కింద నల్లటి వలయాలు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఎక్కువగా ఈ సమస్యతో బాధపడు

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 09:01 PM IST

ఈ రోజుల్లో యువతని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య కళ్ళ కింద నల్లటి వలయాలు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కంటి కింద నల్లటి వలయాలు కారణంగా ముఖం అందవిహీనంగా కనిపించడంతో పాటు వయసు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్‌లో లభించే క్రీములు, లోషన్స్ నుంచి వంటింటి చిట్కాల వరకు అన్నింటినీ పాటిస్తూ ఉంటారు. మరి ఏం చేస్తే కంటి కింద నల్లటి వలయాలు పోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కంటి కింద ప్రాంతాన్ని మనం వేసుకునే బట్టలతో పోల్చి చూడాలట.

ఎందుకంటే మన కంటి చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఎలాంటి రాపిడి తగిలినా ఆ చర్మం కందిపోతుంది. కంటి చుట్టూ ఉండే చర్మం పత్తి లాంటిది అయితే మిగతా శరీర భాగాల్లోని చర్మం డెనిమ్ లాంటిది. మీరు కాటన్, సిల్క్, నైలాన్ దుస్తులను వేర్వేరు పద్ధతుల్లో ఉతికినట్లే కంటి చుట్టూ ఉండే చర్మం, మిగతా భాగాల్లోని చర్మం కూడా వేర్వేరుగా ఉంటుంది. తద్వారా మనం చర్మ సంరక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు కొన్ని స్కిన్ అలర్జీల వల్ల ఉత్పన్నం అవుతాయి. అందువల్ల వాటిని అలర్జీ పైనర్స్ అని అంటారు. డార్క్ సర్కిల్స్ అనేవి మూత్రపిండాలు లేదా అడ్రినల్ అసమతుల్యతలను సూచిస్తాయి.

శరీరంపై అధిక ఒత్తిడి భారం ఉన్నప్పుడు లేదా సరైన నిద్ర లేనప్పుడు ఇలాంటి స్కిన్ అలర్జీలు వస్తాయి. అదేవిధంగా ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా నల్లటి వలయాలకు దారితీస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల కళ్ల కింద రక్తనాళాలు కుచించుకుపోతాయి. తద్వారా నల్లటి వలయాలు మరింత ప్రముఖంగా కనిపిస్తాయి. ఆల్కహాల్ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. మరి ఈ కంది కింద నల్లటి వడియాలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కీర దోసను ముక్కలుగా కట్‌ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.

తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి సాధారణంగా అలొవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన మాయిశ్చర్‌ను అందిస్తుంది. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అలొవెరాను కొద్దిగా కట్‌ చేసి జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోయేందుకు అలొవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. టమోటాను కట్‌ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.