Site icon HashtagU Telugu

Mutton Korma: డాబా స్టైల్ మటన్ కుర్మా.. తయారీ విధానం?

Indian Cricketers

Indian Cricketers

మామూలుగా చాలామంది ఇంట్లో అమ్మలు, భార్యలు ఎంత రుచిగా ఉండినా కూడా రెస్టారెంట్ డాబా స్టైల్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి ఇంట్లో చేసిన వంటలకు బయట దొరికే ఫుడ్ కి టేస్ట్ విషయంలో చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చు. బయట దొరికే ఫుడ్డు ఎక్కువగా రుచిగా ఉంటుందని కొంతమంది అంటే ఇంట్లో ఫుడ్డు రుచిగా ఉంటుందని కొంతమంది అంటారు. అయితే డాబా రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లో రెసిపీ ట్రై చేయాలనుకుంటున్న వారి కోసం ఈ రెసిపీ. డాబా స్టైల్ మటన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మటన్‌ కుర్మాకి కావలసిన పదార్థాలు:

మటన్‌ – అర కేజీ
ఉల్లిపాయలు – రెండు
ఉప్పు – తగినంత
కారం – 4 టీ స్పూన్లు
గరం మసాలా – 2 టీ స్పూన్లు
నూనె – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
పెరుగు – ఒక కప్పు
కొబ్బరి తురుము – చిన్న కప్పు
పల్లీలు – ఒక కప్పు
నువ్వులు – కొద్దిగా
బాదంపప్పు – చిన్న కప్పు

మటన్‌ కుర్మా తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా మటన్‌ని శుభ్రంగా కడగాలి. తర్వాత పల్లీలు, నువ్వులు, విడివిడిగా వేయించుకోవాలి. గరం మసాలా, కొబ్బరి తురుము, బాదంపప్పు వీటంన్నిటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, పేస్ట్‌ను వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి కలపాలి. ఇప్పుడు మటన్‌ వేయాలి. ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత గరం మసాలా, ఉప్పు, పెరుగు, నీరు పోసి బాగా ఉడకనివ్వాలి. పూర్తిగా నీరు మొత్తం ఇగిరిపోయాక స్టవ్ ఆపుకుని కుర్మాని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్‌ కుర్మా రెడీ.

Exit mobile version