Curry Leaves Mixed Buttermilk: సమ్మర్ స్పెషల్ కరివేపాకు మజ్జిగ.. ఇలా చేస్తే ఒక గ్లాసు కూడా మిగలదు?

మామూలుగా సమ్మర్ డ్రింక్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు అందులో ఒకటి లెమన్ వాటర్ రెండవది మజ్జిగ. ఎక్కువ శాతం మంది మజ్జిగను

Published By: HashtagU Telugu Desk
Mixcollage 16 Feb 2024 07 36 Pm 5791

Mixcollage 16 Feb 2024 07 36 Pm 5791

మామూలుగా సమ్మర్ డ్రింక్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు అందులో ఒకటి లెమన్ వాటర్ రెండవది మజ్జిగ. ఎక్కువ శాతం మంది మజ్జిగను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల సహజంగానే వేసవి ఎండల నుండి శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్. ఇది గట్‌లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మజ్జిగ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అయితే ఈ సమ్మర్ స్పెషల్ కరివేపాకు మజ్జిగను ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు. మరి ఈ రెసిపీ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కరివేపాకు మజ్జిగకు కావాల్సిన పదార్థాలు

1 కప్పు పెరుగు
2 కప్పుల నీరు
కరివేపాకు 2 రెమ్మలు
1 పచ్చిమిర్చి
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి
రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం..

మజ్జిగ రెసిపీ చేయడానికి, ముందుగా పెరుగును నీటితో కలిపి మజ్జిగ తయారు చేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో కరివేపాకు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు, ఉప్పు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు మిశ్రమాన్ని మజ్జిగలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు మజ్జిగ రెడీ. ఇలా సింపుల్ గా ట్రై చేస్తే చాలు ఒక్క గ్లాసు మజ్జిగ కూడా మిగలదు.

  Last Updated: 16 Feb 2024, 07:36 PM IST