Site icon HashtagU Telugu

Curd: పెరుగుతో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా?

Curd

Curd

పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికి తెలిసిందే. పెరుగు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పెరుగు లోని భాగాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేమగా మారేలా చేస్తాయి. మరి పెరుగుతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు, నిమ్మరసం రెండు కూడా మంచి టోనర్‌గా పనిచేస్తాయి. అందుకోసం ముందుగా పెరుగులో కాస్తా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాటన్ ప్యాడ్‌ని వేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాయండి.

దీనిని స్కిన్‌కి రాయడం వల్ల పోషకాలు తిరిగి అందుతాయి. ఇది చర్మ పీహెచ్ బ్యాలెన్స్‌కి కూడా చాలా మంచిది. ఈ అడ్డుపడే రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి, ఆర్థ్రీకరణను పెంచడానికి కూడా మంచిది. అదేవిధంగా పెరుగు, తేనెతో మాస్క్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఒక టీ స్పూన్ పెరుగులో టీ స్పూన్ తేనె వేసి బాగా కలపి పేస్టులా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. తేనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఓట్స్ మంచి ఎక్స్‌ఫోలియేటర్. చర్మంలోని మురికిని తొలగించేందుకు బాగా పనిచేస్తుంది.

దీనిని స్క్రబ్‌లా చేసేందుకు ఓ గిన్నెలో కొంచెం పెరుగు, ఓట్స్ తీసుకోండి. రెండింటిని బాగా కలిపి ముఖం, బాడీకి అప్లై చేయండి. ఈ పేస్టుతో ముఖాన్ని, బాడీని స్క్రబ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. ఈ స్క్రబ్ మృతకణాలను తొలగించి అడ్డుపడే రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఇలా తరచుగా చేస్తూ ఉండడం వల్ల మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.