Site icon HashtagU Telugu

‎Weight Loss: ఇవి తింటే చాలు.. జిమ్ తో అవసరం లేకుండా పొట్టలో కొవ్వు కరిగిపోవడం ఖాయం!

Weight Loss

Weight Loss

‎Weight Loss: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా రావచ్చు. అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే పెరుగు, చియా గింజలు ఇవి రెండు బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ కలిపి తింటే, అది సూపర్‌ ఫుడ్‌ గా పనిచేస్తుందట. చియా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా అనేక పోషకాలు ఉంటాయి.

‎అదే సమయంలో పెరుగు ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. పెరుగు, చియా విత్తనాల కలయిక జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా పెరుగు, చియా గింజలలోని ప్రోబయోటిక్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందట. చియా గింజలు నీటిలో ఉబ్బి జెల్ లాంటి స్థితిని ఏర్పరుస్తాయట. ఇది పేగులను శుభ్రపరుస్తుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. పెరుగుతో కలిపి తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందట. కడుపు సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

‎ మీరు బరువు తగ్గాలనుకుంటే, పెరుగు, చియా విత్తనాల కలయిక మీకు మంచి ఎంపిక అని చెబుతున్నారు. చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుందట. అనారోగ్యకరమైన కోరికలను తగ్గిస్తుందని, పెరుగులోని ప్రోటీన్ జీవక్రియను పెంచుతుందని తద్వారా కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుందని పొత్తి కడుపులో కొవ్వును కరిగించుకుంటుంది అని చెబుతున్నారు. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుందట. చియా విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఎముక సాంద్రతను పెంచడంలో సహాయపడతాయట. అందువల్ల పెరుగు, చియా విత్తనాలను తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

‎ చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. పెరుగు, చియా గింజలు చర్మానికి చాలా మేలు చేస్తాయట. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుందని, ఇది చర్మాన్ని తేమ చేస్తుందని, దాని మెరుపును పెంచుతుందని చెబుతున్నారు. చియా విత్తనాలలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మపు మంటను తగ్గిస్తాయట. మొటిమలు, ముడతలను నివారిస్తాయని, జుట్టు బలంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా చియా విత్తనాలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయట. పెరుగుతో వీటిని తినడం వల్ల శరీరానికి ఎక్కువ కాలం శక్తి లభిస్తుందని, ఇది అలసటను తగ్గడంతో పాటు శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

Exit mobile version