Site icon HashtagU Telugu

Cucumber Mutton Curry: ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీని సింపుల్ గా ట్రై చేయండి?

Mixcollage 22 Mar 2024 08 12 Pm 4071

Mixcollage 22 Mar 2024 08 12 Pm 4071

మాములుగా మనం మటన్ తో మటన్ కర్రీ, మటన్ వేపుడు, మటన్ బిర్యానీ ఇలా రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైన దోసకాయ మటన్ కర్రీ తిన్నారా. ఒకవేళ ఇప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

దోసకాయ – ఒకటి
మటన్ – పావుకిలో
ఉల్లిపాయ – ఒకటి
టోమాటో – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – ఒక కట్ట
గరం మసాలా – అర స్పూను
జీలకర్ర పొడి – అరస్పూను
నీళ్లు – తగినన్ని
నూనె – మూడు స్పూనులు

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా మటన్ చిన్న ముక్కలుగా కోసుకుని, పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి. మటన్ ను ముందుగానే కుక్కర్లో రెండు విజిల్స్ వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. విత్తనాలను తీసిపడేయాలి. తర్వాత ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఆపై పసుపు, కారం వేసి వేయించాలి. ఇప్పుడు మటన్ ముక్కలు కూడా వేసి వేయించాలి. మటన్ కాసేపు ఉడికాక దోసకాయ ముక్కలు వేయాలి. దోసకాయ ముక్కలు సగం ఉడికాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఉప్పు, నీళ్లు వేసి చిన్న మంటపై ఉడికించాలి. గ్రేవీ దగ్గరగా అయ్యాక జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి. ఒక్క అయిదు నిమిషాలు ఉడికాక పైన కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.

Exit mobile version