Crying: మనిషిలో అనేక భావాలు ఉంటాయి. పరిస్థితిని బట్టి మనిషిలోని భావాలు మారుతూ ఉంటాయి. మనిషి మాత్రమే తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచగలడు. వీటిల్లో సంతోషంగా పాటు ఏడుపు కూడా ఒకటి. మనకు ఏదైనా బాగా బాధ అనిపించినప్పుడు, కష్టాలు అనిపించినప్పుడు లేదా ఏదైనా సినిమాలో ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడు ఏడుపు వస్తుంది. మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేని సమయంలో అవి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి. అయితే ఏడవడం మంచిది కాదని చాలామంది చెబుతూ ఉంటారు.
కానీ స్వచ్చమైన ఏడుపు ఆరోగ్యానికి మంచిదేననని నిపుణులు చెబుతున్నారు. స్వచ్చమైన ఏడుపు శరీరానికి, మనస్సుకు మేలు చేస్తుందని అంటున్నారు. భావోద్వేగానికి గురైనప్పుడు ఏడవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందట. దీని వల్ల బాధ కాస్త తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారని అంటున్నారు. మనసారా ఏడవడం వల్ల ఏంతో రిలీఫ్ వస్తుందని నిపుణులు చెుబుతున్నారు. ఏడుస్తున్నప్పుడు వచ్చే నీళ్లు మన కంటిని శుభ్రపరుస్తాయి. దీంతో కంట్లోని బ్యాక్టీరియా నుంచి కన్నీళ్లు రక్షిస్తాయి.
కన్నీళ్లలో ఉండే లైసోజైమ్ భాగం శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుందని, ఇదిబయోటెర్రర్ ఏజెంట్ల నుండి కళ్ళను రక్షిస్తుందని చెబుతున్నారు. ఏడుపు మనస్సుకు ప్రశాంతనను ఇస్తుందని, దీని వల్ల రాత్రిపూట త్వరగా నిద్రపట్టడంతో పాటు బాగా నిద్రపడుతుందట. అలాగే ఏడుపు ఆందోళనను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే ఏడుపు మానిక ఆరోగ్యానికి కూడా మంచిదట. ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. వీటి వల్ల ప్రశాంతంగా ఉండగలగుతారు.
అలగే ఏడుపు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుందట. ఏడ్చినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్ కన్నీళ్ల సహాయంతో నెమ్మదిగా బయటకు వస్తాయి. ఈ కన్నీళ్లు వివిధ రకాల మంచి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.