Site icon HashtagU Telugu

Crispy Corn: పిల్లలు ఎంతగానో ఇష్టపడే క్రిస్పీ కార్న్.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 17 Jan 2024 05 43 Pm 9832

Mixcollage 17 Jan 2024 05 43 Pm 9832

మామూలుగా మొక్కజొన్నను ఉపయోగించి కొన్ని రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. అయితే చలికాలంలో అలా మనకు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ లాంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే క్రిస్పీ కార్న్ కొద్దిగా మాత్రమే ఉంటుంది డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రిస్పీ కార్న్ ను ఇంట్లో చేస్తే ఇల్లు మొత్తం ఎంతో సంతోషంగా తినవచ్చు. మరి ఈ క్రిస్పీ కార్న్ ను ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఎప్పుడు మనం తెలుసుకున్నాం..

క్రిస్పీ కార్న్ కి కావలసిన పదార్థాలు:

స్వీట్ కార్న్ – 2 కప్పులు
మొక్కజొన్న పిండి – 1/4 కప్పు
బియ్యం పిండి -2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – 1/2 స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
కారం పొడి – 1/2 స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
వంట నూనె -1 కప్పు

క్రిస్పీ కార్న్ తయారీ విధానం

ఇందుకోసం ముందుగా స్వీట్ కార్న్ గింజలు వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకొని మరిగించాలి. అందులో మొక్కజొన్న గింజలు వేసి కేవలం 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు నీటిని తీసివేసి, సగం ఉడికిన స్వీట్ కార్న్ గింజలను స్ట్రైనర్‌లో వడకట్టి సేకరించాలి. ఒక గిన్నెలో స్వీట్ కార్న్ గింజలు వేయండి. అందులో బియ్యం పిండి, మొక్కజొన్న పిండి వేసి కొద్దిగా నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు దానికి కాస్త ఉప్పు, మిరియాల పొడి వేయాలి. మొక్కజొన్నను పూర్తిగా కోట్ చేయడానికి మళ్లీ కొంచం పొడి పిండి పైన చల్లాలి.. గింజలు ఒక దానితో ఒకటి అంటుకోకుండా కొద్దిగా తేమ ఉంటే చాలు. ఇప్పుడు మొక్కజొన్నను జల్లెడలో వేసి కొద్దిగా షేక్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి పిండిలో ముంచి క్రిస్పీగా, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయాలి. ఒక గిన్నెలో వేయించిన స్వీట్ కార్న్ గింజలు ఉంచాలి. అందులో కారం పొడి, ఎండు యాలకుల పొడి, ఉప్పు నిమ్మరసం జోడించండి. రుచి ప్రకారం ఉప్పు కలపండి. మీ రుచికరమైన క్రిస్పీ కార్న్ రెడీ.

Exit mobile version