Site icon HashtagU Telugu

Cracked Heel : చలికాలంలో పగిలిన మడమలకు వీటితో చెక్ పెట్టొచ్చు..!!

Close,up,of,cracks,on,heels,isolated,white,background

Close,up,of,cracks,on,heels,isolated,white,background

చలికాలంలో మడమలు పగిలిపోవడం సాధారణ విషయమే. కానీ చాలామందికి చలికాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే…సమస్య పెద్దదిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

పగిలిన మడమల కోసం తేనె
పగిలిన మడమలకు తేనె ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో ఇది చర్మం నుండి దుమ్ము-మట్టి, హానికరమైన బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి.
-2 టీస్పూన్లు తేనె
-వేడి నీరు
ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఈ వేడినీటితో మీ పాదాలను శుభ్రం చేసి తేమ లేకుండా తుడవండది. ఇప్పుడు బకెట్లో గోరువెచ్చని నీటిలో మీ పాదాలను ఉంచండి. ఇలా కాసేపు ఉండటం వల్ల పాదాలకు ఉన్న మురికి తొలగిపోతుంది. సుమారు 20 నుండి 25 నిమిషాల తర్వాత, నీరు ఆరిపోయినప్పుడు, మడమలకు తేనేను రాయండి. తర్వాత సాధారణ నీటితో పాదాలను కడగాలి.ఇలా ఒక వారం పాటు చేస్తే మంచి ప్రభావం ఉంటుంది. మీ మడమలు మృదువుగా మారుతాయి.

షాంపూ, నిమ్మకాయ
నిమ్మకాయ చర్మానికి ఎంతో చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మంలోని మురికిని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. పాదాల చీలమండలను శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు .

-1 నిమ్మకాయ
-షాంపూ
-వేడి నీరు
-టవల్

– ముందుగా పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.
– తరువాత, వేడి నీటిలో 1 నిమ్మకాయ రసాన్ని కలపండి. అందులో షాంపూ కూడా వేసి కలపాలి.
– పాదాలను 30 నుండి 35 నిమిషాలు నీటిలో ఉంచండి.
-పాదాలు, చీలమండలను మధ్యలో రుద్దుతూ ఉండండి. ఇలా చేస్తే పాదాలకు ఉన్న మురికి తొలగిపోతుంది.
-వాటర్ లో నుంచి పాదాలను తీసి వాటిని తుడిచి, పాదాలకు, చీలమండలకు కొద్దిగా క్రీమ్ రాయండి.
– ప్రతిరోజూ ఇలా చేస్తే, మీరు 20-25 రోజుల్లో మంచి ప్రభావం ఉంటుంది.