Site icon HashtagU Telugu

Cracked Heels: పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వారానికి ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేస్తే చాలు!

Mixcollage 25 Dec 2023 06 51 Pm 6784

Mixcollage 25 Dec 2023 06 51 Pm 6784

చలికాలంలో ఎదురయ్యే సమస్యలలో చర్మం పొడిబారడం, కానీ మడమలు పగిలిపోవడం అలాంటి సమస్యలు కూడా ఒకటి. ముఖ్యంగా చలికాలంలో ఖాళీ మడమలు పగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి సమయంలో పడుకున్నప్పుడు అలాగే నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చలికాలంలో పాదాలకు ఎక్కువ ధూళి అంటుకుంటుంది. కాబట్టి పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా పాదాలను వేడి నీటిలో కడుక్కుని, క్రీమ్ రాసుకోవాలి. అప్పుడే పాదాలు మృదువుగా ఉంటాయి. అయితే మీరు పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటే వారానికి ఒకసారి ఇప్పుడు మేము చెప్పబోయే ప్యాక్ ట్రై చేస్తే చాలు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

అందుకోసం ఏం చేయాలంటే.. ఒక గిన్నెలో ఒక స్పూన్‌ షాంపూ తీసుకుని అందులో బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పాదాలకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నిమ్మకాయతో పాదాలను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల నుంచి మురికి, ధూళి బయటకు పోయి కాళ్లు నల్లగా కనిపించవు. పాదాలను శుభ్రంగా కడుక్కుని కొబ్బరి నూనె, కాఫీతో తయారు చేసిన ప్యాక్‌ అప్లై చేయాలి. కావాలంటే అందులో ఒక స్పూన్‌ పంచదార కలపవచ్చు. ఇది కఠినమైన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇలా ప్యాక్ వేసుకుంటే మృత కణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా ఉంటాయి.

కాఫీ ప్యాక్ వేసి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. పాదాలను పూర్తిగా తుడిచి గ్లిజరిన్ రాసుకోవాలి. గ్లిజరిన్ అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇది పాదాలకున్న టాన్ తొలగించి, పాదాలను ఫెయిర్‌గా ఉంచుతుంది. చర్మం పొడి బారకుండా ఉండేందుకు గ్లిజరిన్‌పై పలుచని వాసెలిన్ పూత పూయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ పాదాలకు వేసుకుంటే మూడు రోజుల వరకు పాదాలు మృదువుగా ఉంటాయి. కాళ్లు పగలవు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పాదాలకు ఈ ప్యాక్‌ వేసుకున్న తర్వాత క్రమం తప్పకుండా సాక్స్ ధరించడం తప్పనిసరి.