Relationship : సమస్యల్లేని సంసారాన్ని సంతోషంగా సాగించాలంటే..? ఇలా చేయండి..!!

దాంపత్యజీవితంలో ఒకరిమీదఒకరికి ఎంత ప్రేమ ఉన్నా...గౌరవాన్నిఇచ్చిపుచ్చుకోకపోతే...ఆ బంధంలో మనస్పర్థలు రావడం ఖాయం. భార్య భర్తల మధ్య పరస్పరం తమ మధ్య బంధాన్నికూడా గౌరవిస్తేనే ఆ అనుబంధం శాశ్వతంగా నిలుస్తుంది.

  • Written By:
  • Updated On - August 9, 2022 / 10:08 AM IST

దాంపత్యజీవితంలో ఒకరిమీదఒకరికి ఎంత ప్రేమ ఉన్నా…గౌరవాన్నిఇచ్చిపుచ్చుకోకపోతే…ఆ బంధంలో మనస్పర్థలు రావడం ఖాయం. భార్య భర్తల మధ్య పరస్పరం తమ మధ్య బంధాన్నికూడా గౌరవిస్తేనే ఆ అనుబంధం శాశ్వతంగా నిలుస్తుంది. దంపతుల మధ్య ప్రేమకు అంతు అనేది ఉండకూడదు. ఎదుటివారు ఆ ప్రేమను స్వీకరిస్తున్నారా లేదో గుర్తించాలి. మీ ప్రేమను వారు గౌరవించి తిరిగి ప్రేమిస్తున్నారా అనేది గమనించాలి. అలాంటి భావం ఎదుటివారిలో కనిపించినప్పుడు మీ ప్రేమ విలువను వారికి తెలపాలి. లేదంటే మీ ప్రేమకున్న గౌరవాన్నిమీరు కోల్పోయినట్లే. భాగస్వామికి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అనే భరోసా మీరు చూపిస్తే…మీ ప్రేమ వారికి అర్థమయ్యేలా చేయవచ్చు.

దాంపత్యజీవితంలో పాటించాల్సిన సరిహద్దులు కొన్నిఉంటాయి. ఎదుటివారి బాధ్యతల,అవసరాలను గుర్తించి వాటికి తగినట్లుగా మసులుకోవాలి. షాపింగ్ కానీ మరెక్కడికైనా వెళ్లాల్సివస్తే అవతలివారికి అదే సమయంలో మరోముఖ్యమైన పని పడి ఉంటుంది. మీతో తప్పక రావాల్సిందే అంటూ….వారి వ్యక్తిగత బాధ్యతల్లో తలదూర్చకూడదు. వారికీకొన్ని హద్దులు ఉంటాయి వాటిని గౌరవించాలి.

మీలోని లోపాలను మీరు గుర్తించినప్పుడే…ఎదుటివారిలో కనిపించే తప్పులుఒప్పులు అర్థం అవుతాయి. అలాకాదని…అవతలివారిలో తప్పులను మాత్రమే ఎత్తిచూపించడం…మనలో లోపాలు లేవనుకోవడం పొరపాటే. ప్రతిఒక్కరిలోనూ బలహీనతలుంటాయి. వాటిని పరస్పరం అంగీకరించినప్పుడే…సమస్యల్లేని సంసారాన్ని సంతోషంగా సాగించవచ్చు. అవతలివారు మీకు విలువనివ్వకుండా ప్రవర్తిసుంటే ఖండించకుండా ఉండకూడదు….మీ విలువను వారికి తెలియచేయడం మంచిది.