మామూలుగా జుట్టు అందంగా మృదువుగా పొడవుగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ హెయిర్ ఆయిల్స్ తలకు పట్టించే సమయంలో చాలామంది చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. వీటివల్ల బట్టతల సమస్యతో పాటు, హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే తలకు నూనె అప్లై చేసే ముందు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముందుగా నూనెని చేతులోకి తీసుకుని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా అబ్జార్బ్ అయ్యాక గంట, అరగంట ఆగి తలస్నానం చేయడం అన్నది నార్మల్ జరిగే ప్రాసెస్. ఇది సాధారణంగా అందరూ ఫాలో అయ్యే ప్రాసెస్. అయితే నూనెని ఎలా పడితే అలా పట్టించి తలస్నానం చేసేస్తే త్వరగా జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. డ్రై హెయిర్ కి నూనె రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదట. జుట్టుకి కండీషనర్ అప్లై చేసినా, సబ్బు రాసుకున్నా, షాంపూ పెట్టుకున్నా తడిగా అయిపోతుందట. అదే నూనె పెట్టుకుంటే మాత్రం డ్రైగానే ఉంటుంది. చాలా మంది పొడి జుట్టుకి నూనె రాస్తుంటారు. కాసేపు మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేసేస్తారు. కానీ తడి జుట్టుపైనే నూనె రాసుకోవాలట. జుట్టుకి నూనె రాయాలనుకున్న వారు ముందుగా గోరువెచ్చని నీటితో జుట్టుని తడపాలట.
మరీ చల్లని, వేడి నీటితో జుట్టుని తడి చేసుకోకూడదట. గోరు వెచ్చని నీటితో తడిపిన తర్వాత నూనె రాసుకోవాలి. చాలా మంది కొబ్బరి నూనె వాడుతుంటారు. అయితే ఆవాల నూనె జుట్టుకి చాలా మంచిదని, అందుకే గోరువెచ్చని నీటితో జుట్టుని తడి చేసుకున్న తర్వాత ఆవాల నూనె పట్టించాలని చెబుతున్నారు. నూనె పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దువ్వుకోవాలి. 5 నిమిషాలు ఆగి షాంపూతో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. రోజూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు.