Constipation: మీకు మలబద్దకం సమస్య ఉందా.. ఈ చిట్కా మీకోసమే..!

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 01:37 PM IST

జీవనశైలి మాత్రమే కాకుండా ఆహారం కూడా మంచిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఫలితంగా కడుపు సమస్యలు తలెత్తుతాయి. ఈ రకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో మలబద్ధకం ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. అయితే ఈ చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఒక వ్యక్తికి మలబద్ధకం సమస్య ఉంటే అతని జీవితం నరకం అవుతుంది. రోజువారీ దినచర్య ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అందుకే రోజూ రాత్రి ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని తాగాలి. పాలలో ఉండే అన్ని రకాల పోషకాలు, నెయ్యిలోని కొవ్వు పదార్థాలు ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. మలబద్ధకం సమస్య పరిష్కారమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

చాలామందికి తీవ్రమైన ఎముక నొప్పి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రాత్రిపూట పాలతో నెయ్యి తాగడం వల్ల కీళ్లలో లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. వాపు, నొప్పి తొలగిపోతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు కొన్ని వారాల్లోనే మాయమవుతాయి. రోజూ రాత్రి నెయ్యి కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడే వారికి ఇది చక్కటి చిట్కా. ఇలా చేయడం వల్ల మీరు రాత్రికి 7-8 గంటల పాటు మంచి, సౌకర్యవంతమైన నిద్ర పొందుతారు.

వీటితో పాటు.. పండిన అరటిపండు లేదా బొప్పాయిని భోజనం తర్వాత ప్రతిరోజూ తినండి, ఇది మలబద్ధకం సమస్యను నయం చేయడానికి ఉపయోగకరమైన ఆహారాలలో ఒకటి. ఈ అలవాటు మలబద్ధకం సమస్య తప్పకుండా తీర్చుతుంది. ఇవేకాకుండా.. జీలకర్రలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. జీలకర్ర తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 1 టీస్పూన్ జీలకర్ర గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. నీరు, తేనెతో కలిపి, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తినండి. దీనితో పాటు, అల్లం మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. మాంసం, చిప్స్, కెఫిన్, హార్డ్ ఫుడ్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి.

Read Also : ThippaTheega : ప్రతిరోజు ఒక గ్లాసు తిప్పతీగ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?