Site icon HashtagU Telugu

Congestion: మసాలా టీ చేసేయ్..ముక్కు దిబ్బడకు చెక్ పెట్టెయ్!

Tea congestion

Tea Imresizer

ముక్కు దిబ్బడ సమస్యను ఎదుర్కోవడానికి మీరు అల్లం, తేనె మిశ్రమాన్ని కూడా తీసుకుంటారా? అయితే మీరు ఒక్కరే ఇలా చేయడం లేదని తెలుసుకోండి. మీలా ఎంతోమంది ఇలాంటి ఇంటి చిట్కాలను వాడుతుంటారని గ్రహించండి. చలికాలంలో జలుబు, జ్వరం , ఇతర శ్వాసకోశ వ్యాధులు సర్వసాధారణం. అయితే, నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లడానికి ముందు.. మనలో చాలా మంది వివిధ ఇంటి చిట్కాలను ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. మీరు కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళు అయితే.. లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో షేర్ చేసిన తాజా పోస్ట్‌ను ఒకసారి చూడండి. అతను ఊపిరితిత్తుల సమస్యలు, మందపాటి కఫం/శ్లేష్మం సమస్యకు చెక్ పెట్టేందుకు శక్తివంతమైన ఒక ఇంటి చిట్కాను అందరితో పంచుకున్నాడు.

శరీరంలో కఫం లేదా శ్లేష్మం యొక్క అధిక ఉత్పత్తి చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. దీన్ని నిరోధించే ఒక ఇంటి చిట్కాకు వంటగదిలో ప్రాణం పోయొచ్చు. ఇందుకోసం తరిగిన ఉల్లిపాయలు (1 టేబుల్ స్పూన్), రసాయనాలు లేని బెల్లం( 1 టేబుల్ స్పూన్), పసుపు (1/4 టేబుల్ స్పూన్),
నల్ల మిరియాలు (ఒక చిటికెడు) కలిపి తీసుకోవాలి. వాటిని సుమారు మూడు నిమిషాలు ఉడకబెట్టండి. దీంతో ఒక ప్రత్యేకమైన మసాలా టీ రెడీ అవుతుంది.అనంతరం దాన్ని గుటుక్కున తాగండి.

మీరు ఈ శీతాకాలంలో వెచ్చగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి పసుపు పాలు వంటి ఇతర ఇంట్లో తయారుచేసిన పానీయాలను కూడా ప్రయత్నించవచ్చు.