గింజలతో సంపూర్ణ ఆరోగ్యం..రోజువారీ ఆహారంలో ఇవి తప్పనిసరి..!

రోగనిరోధక శక్తి బలోపేతం కావడం, శక్తి స్థాయిలు పెరగడం, మానసిక-శారీరక పనితీరు మెరుగుపడడం అన్నీ సరైన ఆహారంపై ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

Published By: HashtagU Telugu Desk
Nuts And Seeds, specialty of nuts, Brain, digestion, Long term health benefits, Immunity, Fats, carbohydrates, proteins, vitamins, minerals

Nuts And Seeds, specialty of nuts, Brain, digestion, Long term health benefits, Immunity, Fats, carbohydrates, proteins, vitamins, minerals

. పోషకాల గని..గింజల ప్రత్యేకత

. మెదడు, జీర్ణక్రియ, బరువు నియంత్రణలో గింజల పాత్ర

. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు మరియు తీసుకునే విధానం

Nuts And Seeds : మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే పోషకాలు అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి బలోపేతం కావడం, శక్తి స్థాయిలు పెరగడం మానసిక-శారీరక పనితీరు మెరుగుపడడం అన్నీ సరైన ఆహారంపై ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పోషకాలతో నిండిన ఆహారాల్లో గింజలు ఒక శక్తివంతమైన వనరుగా నిలుస్తాయి. గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఈ, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాకుండా పోషకాహార లోపాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా గింజల్లో ఉండే ఒమెగా–3, ఒమెగా–6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యం పెరుగుతాయి. గింజల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి, అధికంగా తినే అలవాటును తగ్గిస్తుంది. దీని వల్ల బరువు నియంత్రణ సులభమవుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కూడా ఇవి దోహదపడతాయి. మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో గింజలు మంచి ఆహార ఎంపికగా నిలుస్తాయి. గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, శరీర కణాలను రక్షిస్తాయి.

గింజల వినియోగం కాలేయం, పిత్తాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్య తగ్గడమే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించే గుణాలు గింజల్లో ఉన్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా రావడానికి దోహదపడతాయి. అయితే గింజల్లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు ఒక గుప్పెడు సరిపోతుంది. నూనె, ఉప్పు, చక్కెర కలపని సహజ గింజలను మాత్రమే ఎంచుకోవాలి. వీటిని నానబెట్టి తీసుకుంటే పోషకాలు మరింత సులభంగా శరీరానికి అందుతాయి. బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా, బ్రెజిల్ నట్స్ వంటి వివిధ రకాల గింజలను మారుస్తూ తీసుకోవడం మంచిది. పెరుగు, ఓట్‌మీల్, సలాడ్‌లలో కలిపి తింటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజువారీ ఆహారంలో గింజలను భాగం చేసుకుంటే, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.

 

 

  Last Updated: 24 Jan 2026, 08:41 PM IST