‎Hair Loss: ఇది విన్నారా.. ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల గ్యారెంటీ అంటా.. జాగ్రత్త!

‎Hair Loss: ఇప్పుడు చెప్పబోయే ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల రావడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Hair Loss

Hair Loss

‎Hair Loss: మన జీవినశైలి మాత్రమే కాకుండా మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుందట. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జుట్టు రాలడం. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. అధిక నూనె, రసాయన షాంపూల వాడకం, ఒత్తిడి, పేలవమైన జీవనశైలి ఇవన్నీ ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

‎దీనితో పాటు తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. కొన్ని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడం సమస్య పెరుగుతుందట. జుట్టు రాలడానికి చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. ఇది శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజెన్ హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందని, ఈ హార్మోన్లు జుట్టు కుదుళ్లను కుదించుతాయని చెబుతున్నారు. ఇది జుట్టు రాలడానికి, జుట్టు పెరుగుదలను కుదిస్తుందట. ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయట.

‎ ఇవి జుట్టును బలహీనపరుస్తాయని, జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అదేవిదంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా తల చర్మం కూడా బలహీనపడుతుందట. దీనివల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుందని చెబుతున్నారు. ఆల్కహాల్ డీహైడ్రేషన్‌ ను పెంచుతుందట. శరీరంలో జింక్, ఇతర ముఖ్యమైన పోషకాల తగ్గుదలకు దారితీస్తుందని, జింక్ లోపం జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుందని జుట్టు రాలడాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు హార్మోన్ స్థాయిలను పెంచుతాయట. ఈ హార్మోన్ జుట్టు మూలాలను బలహీనపరుస్తుందని, జుట్టు రాలడానికి దారితీస్తుందని చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుందట. దీని వల్ల తల చర్మం పొడిబారిపోతుందని, జుట్టు పెరుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

  Last Updated: 15 Dec 2025, 06:07 AM IST