Site icon HashtagU Telugu

Colourful Kaju Sweet: పిల్లలు ఎంతగానో ఇష్టపడే కలర్ ఫుల్ కాజు స్వీట్.. సింపుల్ గా ట్రై చేయండి?

Mixcollage 12 Feb 2024 07 27 Am 8195

Mixcollage 12 Feb 2024 07 27 Am 8195

మామూలుగా చిన్న పిల్లలు ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే స్వీట్ లో ఎప్పుడు తినేవి కాకుండా అప్పుడప్పుడు ఏమైనా కొత్తగా తినాలని కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కలర్ ఫుల్ కాజు స్వీట్ కూడా ఒకటి. ఇది రంగు రంగులుగా ఉండడంతో పాటు చూడగానే నోరూరిస్తూ ఉంటుంది. మరి ఈ తియ్యతియ్యని స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కలర్ ఫుల్ కాజు స్వీట్ కి కావలసిన పదార్థాలు :

కాజు పేస్ట్ – 200 గ్రాములు
చక్కెర -150 గ్రాములు
బాదం పేస్ట్ – 50 గ్రాములు
డ్రైఫ్రూట్స్, జీడిపప్పు – అర కప్పు
పిస్తా – 10గ్రాములు
కిస్‌మిస్ – 10 గ్రాములు
చక్కెర – 30 గ్రాములు
గ్రీన్ కలర్ – చిటికెడు
గులాబీ రంగు ఫుడ్ కలర్- చిటికెడు

కలర్ ఫుల్ కాజు స్వీట్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా జీడిపప్పు పేస్టులో పంచదార కలిపి ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత ఒక ట్రేలోకి తీసుకుని, ఫుడ్ కలర్, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కలిపి పక్కన ఉంచాలి. బాదం పేస్టులో నాలుగు స్పూన్ ల పంచదార వేసి ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత రెండు భాగాలు చేసి ఒక భాగంలో గ్రీన్ కలర్ కలపాలి. ఇప్పుడు ముందుగా ట్రేలో గ్రీన్ కలర్ కలిపిన బాదం మిశ్రమాన్ని, ఆ పైన తెల్లగా ఉన్న బాదం మిశ్రమాన్ని సర్దాలి. ఇప్పుడు పింక్ కలర్ కాజు మిశ్రమం బాల్‌ని పెట్టి రోల్ చేసి అన్ని భాగాలను మూసినట్లు చేయాలి. వీటిని కట్ చేసి ముక్కలుగా సర్వ్ చేసుకోవాలి. అంతే కలర్ ఫుల్ కాజు స్వీట్ రెడీ.

Exit mobile version