Site icon HashtagU Telugu

Coconut Water Hair Wash: కొబ్బరి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకుంటే కలిగే లాభాలు ఇవే?

Mixcollage 08 Feb 2024 06 45 Pm 119

Mixcollage 08 Feb 2024 06 45 Pm 119

కొబ్బరినీరు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇష్టపడుతూ ఉంటారు. హెల్త్ బాగో లేనప్పుడు నీరసంగా అనిపించినప్పుడు వాంతులు వంటివి అవుతున్నప్పుడు కొబ్బరి నీరు తాగమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొబ్బరినీరు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి సంబంధించిన సమస్యలు చుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కొబ్బరినీరు బాగా పనిచేస్తాయి. మీకు తెలుసా కొబ్బరి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మరి కొబ్బరి నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరి నీళ్లను హెయిర్‌ వాష్‌గా వాడడం వల్ల కేశాలకు, మాడకు లోతైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. చండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే మాయిశ్చరైజింగ్‌ గుణాలు మెరుగైన జుట్టు స్థితిస్థాపకతకు దోహదం చేస్తాయి. ఇవి జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలను నివారిస్తాయి. బ్లషింగ్‌, స్టైలింగ్‌, కాలుష్యం నుంచి జుట్టును రక్షిస్తుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు జుట్టు కుదుళ్లకు పోషణ అందించి అరోగ్యకరమైన, దృఢమైన జుట్టును అందిస్తాయి.

కొబ్బరి నీళ్లతో తరచు జుట్టు శుభ్రం చేస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు.. జుట్టు కుదుళ్లకు పోషణ అందించి.. అరోగ్యకరమైన, దృఢమైన జుట్టును అందిస్తాయి. కొబ్బరి నీళ్లతో తరచు జుట్టు శుభ్రం చేస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కొబ్బరి నీళ్ల pH తలపై, జుట్టుపై ఉండే సహజ pH స్థాయిని పోలి ఉంటుంది. కొబ్బరి నీళ్లను హెయిర్ వాష్‌గా ఉపయోగించడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్‌ను పునరుద్ధరిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సమతుల్య pH స్థాయిలు మృదువైన, మెరిసే జుట్టును అందిస్తుంది.
డీహైడ్రేషన్‌, తేమ లేకపోవడం వంటి కారణాలు వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు చిక్కుల పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొబ్బరి నీళ్లోతో జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. ఇది క్యూటికల్స్‌ను సున్నితంగా చేస్తుంది, ఫ్రిజ్‌ని తగ్గిస్తుంది. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది.