Site icon HashtagU Telugu

Coconut Semiya Payasam: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సేమియా పాయసం.. సింపుల్గా ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 31 Jan 2024 05 13 Pm 5914

Mixcollage 31 Jan 2024 05 13 Pm 5914

మామూలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పాయసాన్ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. పాయసంలో ఎన్నో రకాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సేమియా పాయసం, రవ్వ పాయసం, శనగబేళ్ల పాయసం ఇలా ఎన్నో రకాల పాయసాలు తయారు చేసుకొని తిని ఉంటాం. అయితే ఎప్పుడైనా మీరు కొబ్బరి సేమియా పాయసం తిన్నారా. పిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే ఈ పాయసాన్ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి సేమియా పాయసంకి కావలసిన పదార్థాలు:

కొబ్బరి పాలు – ఒక కప్పు
సేమియా – అరకప్పు
యాలకుల గింజలు – అర టీ స్పూను
నీరు – పావు కప్పు
జీడిపప్పు తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు కాడలు – 2
బెల్లం – 2 టేబుల్‌ స్పూన్లు.

కొబ్బరి సేమియా పాయసం తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి సేమియా దోరగా వేగించి పక్కన పెట్టాలి. మరో కడాయిలో కొబ్బరి పాలు పోసి వేడి చేయాలి. తర్వాత అందులో నీరు, బెల్లం వేసి అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాలు అయ్యాక సేమియా వేసి ఒక పొంగు రాగానే చిటికెడు ఉప్పు వేసి మంట తగ్గించాలి. సేమియా చిక్కబడ్డాక జీడిపప్పు, కుంకుమ పువ్వు కలిపి దించేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సేమియా పాయసం రెడీ.