Site icon HashtagU Telugu

Coconut Pineapple Halwa: కొబ్బరి పైనాపిల్ హల్వా.. ఇంట్లోనే చేసుకోండిలా?

Coconut Pineapple Halwa

Coconut Pineapple Halwa

స్వీట్ ఐటమ్ లో ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ హల్వా. అయితే హల్వాలో ఎన్నో రకాల హల్వాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాజు హల్వా, డ్రైఫ్రూట్స్, రవ్వ హల్వా,క్యారెట్ హల్వా, గుమ్మడి హల్వా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల రెసిపీలు ఉన్నాయి. అయితే ఎప్పుడైనా కొబ్బరి పైనాపిల్ హల్వా తిన్నారా. ఒకవేళ ఇప్పుడు ట్రై చేయకపోతే, రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి పైనాపిల్ హల్వాకి కావలసిన పదార్ధాలు:

కొబ్బరి తురుము – రెండు కప్పులు
పైనాపిల్ ముక్కలు – తగినన్ని
నెయ్యి – 2 స్పూన్లు
పంచదార – కప్పు
యాలకుల పొడి – కొద్దిగా

కొబ్బరి పైనాపిల్ హల్వా తయారీ విధానం:

ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి కొబ్బరి తురుము వేయించుకోవాలి. ఆ తరువాత పైనాపిల్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని వేయించుకున్న కొబ్బరి తురుములో కలిపాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి, పంచదార కూడా వేసి అది కరిగిన తరువాత పైన మిశ్రమం వేసి యాలకుల పొడి వేసి తడి అంతా ఆవిరైపోయేవరకూ కలుపుతూ ఉడికించాలి. చివరిగా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పైనాపిల్ హల్యా రెడీ.