Coconut Milk: పొడవాటి జుట్టు కోసం ట్రై చేస్తున్నారా.. అయితే కొబ్బరి పాలతో ఇలా చేయండి?

మామూలుగా అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా పొడవైన నల్లటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక పొడవాటి జుట్టు కోసం ఎన్నెన్నో ఆయుర్వేద చిట్కాలు, రకరకాల

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 08:43 PM IST

మామూలుగా అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా పొడవైన నల్లటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక పొడవాటి జుట్టు కోసం ఎన్నెన్నో ఆయుర్వేద చిట్కాలు, రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. మీరు కూడా పొడవాటి జుట్టు కావాలనుకుంటున్నారా. అయితే కొబ్బరిపాలతో ఈ విధంగా చేయాల్సిందే. కొబ్బరి పాలలో ఎన్నో హెల్తీ, బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. కొబ్బరి పాలను కేవలం తాగడానికి మాత్రమే కాకుండా కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.ఇవి చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పొడవాటి జుట్టు కావాలనుకునేవారు కొబ్బరిపాలను ట్రై చేయవచ్చు.

మరి కొబ్బరిపాలతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది. ఆహారంతో పాటు కూరల్లో కొబ్బరి పాలని చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరచడంలో సాయపడతాయి. ఇది ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల్ని తగ్గించంలో సాయపడుతుంది. చర్మాన్ని క్లీన్ చేయడం కోసం రెండు టీ స్పూన్ల చిక్కటి కొబ్బరి పాలని తీసుకోవాలి. దీంట్లో శుభ్రమైన గుడ్డని ముంచి ముఖానికి రాయాలి. దీని వల్ల చర్మంలోని మురికి, జిడ్డు పోతుంది. అదే విధంగా, కొబ్బరి పాలు, తేనె, గుడ్డు మూడింటిని కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. దీని వల్ల చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది.

చర్మం తేమని నిలుపుకోవడంలో సాయపడుతుంది. కొబ్బరిపాలు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. ఇది చర్మ తేమని కోల్పోకుండా చేస్తుంది. చర్మం పొడిబారకుండా, ముడతలు లేకుండా మంచి చర్మాన్ని పొందడానికి సాయపడుతుంది. అలాగే, ఇది చర్మం pH స్థాయిని బ్యాలెన్స్ సాయపడుతుంది. ఇది చర్మాన్ని బ్యాక్టీరియాతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి గ్లో రావడానికి కొబ్బరిపాలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలు, మడతలు తగ్గించడానికి సాయపడుతుంది. కొబ్బరిపాలను మనం బ్యూటీని పెంచుకోవడంలో కూడా వాడుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఇది స్కిన్ బ్యూటీ, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సాయపడుతుంది. కొబ్బరిపాలను క్రమం తప్పకుండా, కనీసం వారానికి ఓసారి వాడే వారికి బ్యూటీ బెనిఫిట్స్ అందుతాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొబ్బరిపాలు, గుడ్డు, పెరుగు కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. దీని వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. తేమగా ఉంటుంది. వారానికి ఒక సారి అప్లై చేస్తే మంచిది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొబ్బరిపాలలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి, ఇది జుట్టు నిగనిగలాడేందుకు, దృఢంగా మార్చడంలో సాయపడుతుంది.