Site icon HashtagU Telugu

Coconut Jaggery Burfi: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బెల్లం బర్ఫీ.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 03 Jan 2024 05 02 Pm 6369

Mixcollage 03 Jan 2024 05 02 Pm 6369

మామూలుగా మనం కొబ్బరి, బెల్లం ఈ రెండు రకాల పదార్థాలను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. అలాగే ఎన్నో రకాల వంటకాలు తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక బెల్లంతో ప్రత్యేకించి కొన్ని రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొబ్బరి తో కూడా పలు రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ లో తయారైన కొబ్బరి బెల్లం బర్ఫిని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ నీ ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి బెల్లం బర్ఫీకి కావాల్సిన పదార్థాలు:

పచ్చికొబ్బరి ముక్కలు – 1కప్పు
కాచి చల్లార్చిన పాలు – ముప్పావు కప్పు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
యాలకులు – 3
నెయ్యి- పావు కప్పు
శనగపిండి – ఒక కప్పు

కొబ్బరి బెల్లం బర్ఫీ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పాలు, బెల్లం తురుము, యాలకులు మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత శనగపిండి వేసి కలుపుతూ వేయించుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించి తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీనిని మరో 5 నిమిషాల పాటు కలుపాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని బాణలికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని ఇలా ఉడికించిన తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టప్ ఆఫ్ చేయాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రుచికరంగా ఉండే కోకనట్ బర్ఫీ రెడీ.