Site icon HashtagU Telugu

Coconut Energy Balls: ఎంతే టేస్టీగా ఉండే కోకోనట్ ఎనర్జీ బాల్స్.. ఇంట్లోనే చేసుకోండిలా?

Coconut Energy Balls

Coconut Energy Balls

మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది స్వీట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడు ఒకే రకమైన స్వీట్లు కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. అలా మీరు కూడా కొత్తగా ఏవైనా స్వీట్ తినాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ఎనర్జీ బాల్స్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కోకోనట్ ఎనర్జీ బాల్స్ కి కావలసిన పదార్థాలు:

పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
ఖర్జూరాలు – పది
బాదంపప్పు – అరకప్పు
పొడి చేసిన బెల్లం – పది చెంచాలు
దాల్చినచెక్క పొడి – చిటికెడు

కోకోనట్ ఎనర్జీ బాల్స్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఖర్జూరాల్లో గింజలు తీసేసి, వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత బాదంపప్పు తొక్క ఒలిచేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆపై ఒక గిన్నెలో బెల్లం వేసి స్టౌ మీద పెట్టాలి. బెల్లం కరిగిన తరువాత కొబ్బరి వేసి బాగా కలియబెట్టాలి. పాకం లాగా అవుతున్నప్పుడు ఖర్జూరాల పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం అంతా దగ్గరగా అయినప్పుడు తురిమిన బాదం పప్పుల్ని కూడా వేసి కలిపి దించేయాలి. మిశ్రమం మరీ చల్లారక ముందే లడ్డూల్లా చేసుకోవాలి. వీటికి కాస్త పచ్చి కొబ్బరి అద్దితే చాలు
కోకోనట్ ఎనర్జీ బాల్స్ రెడీ.